Telugu Global
Cinema & Entertainment

బొమ్మ బెదిరింది...

కరోనా మహమ్మారి నేపథ్యంలో 9 నెలల కిందట మూతబడిన థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం మంగళవారం (నవంబర్ 24) నుంచి థియేటర్లు తెరుచుకోవాల్సి ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో మార్నింగ్ షో పడనే లేదు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. నైజాం ప్రాంతంలో సినిమా కలెక్షన్లు అధికంగా వచ్చేది జీహెచ్ఎంసీ ప్రాంతం నుంచే. ప్రస్తుతం అక్కడ ఎన్నికల […]

బొమ్మ బెదిరింది...
X

కరోనా మహమ్మారి నేపథ్యంలో 9 నెలల కిందట మూతబడిన థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం మంగళవారం (నవంబర్ 24) నుంచి థియేటర్లు తెరుచుకోవాల్సి ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో మార్నింగ్ షో పడనే లేదు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

నైజాం ప్రాంతంలో సినిమా కలెక్షన్లు అధికంగా వచ్చేది జీహెచ్ఎంసీ ప్రాంతం నుంచే. ప్రస్తుతం అక్కడ ఎన్నికల హడావిడి ఉంది. దీంతో థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు వస్తారా… రారా… అనే అనుమానాలతో హైదరాబాద్‌లో అసలు థియేటర్లు తెరుచుకోలేదు. డిసెంబర్ 4న ఎన్నికలు ముగిసిన తర్వాత తెరవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.

మరోవైపు ప్రభుత్వం కోవిడ్ నిబంధనల ప్రకారం 50 శాతం సీట్లు మాత్రమే నింపి షో వేయాలని తెలిపింది. అలా చేస్తే థియేటర్లకు నష్టాలు వస్తాయి. పెండింగ్ బిల్లులను మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా… థియేటర్లను ఇప్పటికిప్పుడు తెరవడానికి యజమానులు సంకోచిస్తున్నారు.

ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీల్లో పెట్టేశారు. కొత్తగా సినిమాలు రిలీజ్ చేయడానికి కొంత సమయం పడుతుందని నిర్మాతలు చెబుతున్నారు. అంతే కాకుండా 50 శాతం ఆక్యుపెన్సీతో అయితే టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించాలని థియేటర్ యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ సమస్యలన్నీ వారం పది రోజుల్లో పరిష్కరిస్తేనే థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉన్నది.

First Published:  24 Nov 2020 1:09 AM GMT
Next Story