Telugu Global
Cinema & Entertainment

యూవీ-మారుతి-రవితేజ

ఎట్టకేలకు మారుతికి హీరో దొరికాడు. లాక్ డౌన్ టైమ్ లో 3 కథలు రాసుకున్నాడు మారుతి. వాటిలో ఒక కథకు మెరుగులు దిద్దాడు. ఆ కథతోనే సెట్స్ పైకి రావాలనుకున్నాడు. కానీ మారుతికి హీరో దొరకలేదు. అంతా బిజీగా ఉన్నారు. మరోవైపు వెయిట్ చేసే పరిస్థితిలో లేడు మారుతి. సరిగ్గా అదే టైమ్ లో రవితేజ అందుబాటులోకి వచ్చాడు. అలా మారుతి-రవితేజ ఫ్రెష్ కాంబినేషన్ ఫిక్స్ అయింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా […]

యూవీ-మారుతి-రవితేజ
X

ఎట్టకేలకు మారుతికి హీరో దొరికాడు. లాక్ డౌన్ టైమ్ లో 3 కథలు రాసుకున్నాడు మారుతి. వాటిలో ఒక కథకు మెరుగులు దిద్దాడు. ఆ కథతోనే సెట్స్ పైకి రావాలనుకున్నాడు. కానీ మారుతికి హీరో దొరకలేదు. అంతా బిజీగా ఉన్నారు. మరోవైపు వెయిట్ చేసే పరిస్థితిలో లేడు మారుతి. సరిగ్గా అదే టైమ్ లో రవితేజ అందుబాటులోకి వచ్చాడు. అలా మారుతి-రవితేజ ఫ్రెష్ కాంబినేషన్ ఫిక్స్ అయింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ప్రస్తుతం రవితేజ మేనరిజమ్స్ కు తగ్గట్టు స్క్రిప్ట్ కు మార్పుచేర్పులు చేసే పనిలో పడ్డాడు మారుతి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదు. క్రాక్ సినిమాను పూర్తిచేసిన మాస్ రాజా.. ఖిలాడీ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత త్రినాథరావు నక్కిన సినిమా లైన్లో ఉంది. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతే మారుతి మూవీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  24 Nov 2020 9:30 AM GMT
Next Story