ఆదిపురుష్ కోసం ప్రభాస్ మేకోవర్…

త్వరలోనే ఆదిపురుష్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ప్రభాస్. దీనికి సంబంధించి ఆల్రెడీ మేకోవర్ పనులు కూడా మొదలుపెట్టాడు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఈ పాత్ర కోసం విలుకాడి ఫిజిక్ లోకి మారేందుకు ఆల్రెడీ కసరత్తులు ప్రారంభించాడు.

తాజాగా రిలీజైన ఫొటోల్లో ప్రభాస్ స్లిమ్ గా కనిపిస్తున్నాడు. చూస్తుంటే… దర్శకుడు ఓం రౌత్ అనుకున్న లుక్ ను ప్రభాస్ దాదాపు సాధించినట్టే కనిపిస్తున్నాడు. బాహుబలి టైమ్ లో కాస్త కండలతో లావుగా కనిపించిన ప్రభాస్, ఆదిపురుష్ కోసం వెంటనే స్లిమ్ అయ్యాడు.

ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ లో ఉన్నాడు ప్రభాస్. ఈ మూవీకి సంబంధించి రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో క్లైమాక్స్ పార్ట్ షూట్ చేస్తున్నారు. జనవరి నుంచి ఆదిపురుష్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 3 నెలలు మాత్రమే కాల్షీట్లు ఇచ్చాడు. 90 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేయబోతున్నారు.