Telugu Global
National

ఏపీ హై కోర్ట్ కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్...

ఏపీ హైకోర్టు ఇచ్చిన సంచలన గ్యాగ్ ఆర్డర్ కి సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ అమలుపై సుప్రీం స్టే ఇచ్చింది. గ్యాగ్ ఆర్డర్ ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఏపీ హైకోర్టుకి కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. రాజధాని భూ కుంభకోణం కి సంబంధించి వివరాలు ఎందుకు వెల్లడి […]

ఏపీ హై కోర్ట్ కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్...
X

ఏపీ హైకోర్టు ఇచ్చిన సంచలన గ్యాగ్ ఆర్డర్ కి సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ అమలుపై సుప్రీం స్టే ఇచ్చింది.

గ్యాగ్ ఆర్డర్ ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఏపీ హైకోర్టుకి కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. రాజధాని భూ కుంభకోణం కి సంబంధించి వివరాలు ఎందుకు వెల్లడి చేయరాదని ప్రశ్నించింది. నేరం జరిగితే విచారణ జరపాల్సిన అవసరం లేదా? దర్యాప్తు, మీడియా రిపోర్టింగ్ ఏదీ వద్దా ? పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆర్డర్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది.

దమ్మాలపాటి పిటిషన్ వేస్తే 13 మందికి ఎలా వర్తింపజేస్తారంటూ.. దమ్మాలపాటి సహా 13మందికి నోటీసులు జారీ ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి చివరికి వాయిదా వేస్తూ.. అప్పటి వరకు కేసు ఫైనల్ చేయవద్దంటూ ఏపీ హై కోర్టుకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేతో అమరావతి భూముల కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తుకి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. అమరావతి భూముల కుంభకోణంపై ఎఫ్ఐఆర్ లో వివరాలు ఇకపై పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇవ్వొచ్చు. దీంతో ఎఫ్ఐఆర్ లో వివరాలు బైటకొచ్చే అవకాశం లభించినట్టయింది.

అమరావతి భూముల ఎఫ్ఐఆర్ లో మాజీ అడ్వొకేట్ జనరల్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుమార్తెలకు సంబంధించిన అనేక అంశాలున్నాయి. ఇవన్నీ బైటకు రాకుండా, మీడియాలో ప్రసారం కాకుండా.. ఏపీ హైకోర్టు గతంలో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడీ గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే ఇచ్చింది.

First Published:  25 Nov 2020 4:19 AM GMT
Next Story