Telugu Global
National

వరదసాయం రూ. 50 వేలు... మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్​

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పాగా వేసేందుకు అధికార టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ దూసుకుపోతున్నాయి. అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారం మొదలుపెట్టి టీఆర్​ఎస్​ దూసుకుపోతుండగా.. బీజేపీ, కాంగ్రెస్​ కూడా ప్రచారం ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్​ సోమవారం మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అన్ని వర్గాలవారికి వరాలు కురిపించారు. మంగళవారం కాంగ్రెస్​ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి వరాల జల్లు కురిపించారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 […]

వరదసాయం రూ. 50 వేలు... మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్​
X

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పాగా వేసేందుకు అధికార టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ దూసుకుపోతున్నాయి. అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారం మొదలుపెట్టి టీఆర్​ఎస్​ దూసుకుపోతుండగా.. బీజేపీ, కాంగ్రెస్​ కూడా ప్రచారం ముమ్మరం చేశాయి.

సీఎం కేసీఆర్​ సోమవారం మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అన్ని వర్గాలవారికి వరాలు కురిపించారు. మంగళవారం కాంగ్రెస్​ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి వరాల జల్లు కురిపించారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు సాయమందిస్తామని ప్రకటించారు.

మరోవైపు వరదల్లో మునిగిన కుటుంబాలకు తక్షణసాయం కింద రూ. 50 వేలు చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. ఎంఎంటీఎస్​ రైళ్లలో మహిళలకు, దివ్యాంగులకు ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రో విస్తరిస్తామని కూడా మ్యానిఫెస్టోలో ప్రకటించారు.

ఇటీవల హైదరాబాద్​లో వచ్చిన వరదలు నగర ప్రజలను తీవ్రంగా ఇబ్బందికి గురిచేశాయి. అయితే వరదల్లో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1​0 వేలు ఆర్థికసాయం ప్రకటించింది. కానీ ఆ సొమ్ము అందజేతలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. టీఆర్​ఎస్​ కార్యకర్తలకే డబ్బులు ఇచ్చారని.. చోటా మోటా నాయకులు సగం డబ్బులే ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయాన్ని ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​లో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఇదే విషయంపై ప్రజలు నిలదీస్తున్నారు.

తాజాగా ఖైరతాబాద్​లో ప్రచారం నిర్వహించిన అక్కడి ఎమ్మెల్యే దానం నాగేందర్​కు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్​ పార్టీ వ్యూహాత్మకంగా మ్యానిఫెస్టోను రూపొందించింది. వరద బాధిత కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం ప్రకటించడం నిజంగా సాహసమే. మరోవైపు చనిపోయిన కుటుంబాలకు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు కూడా భారీ సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు.

First Published:  24 Nov 2020 9:37 PM GMT
Next Story