Telugu Global
Cinema & Entertainment

ఇటు షూటింగ్... అటు హనీమూన్...

లాక్ డౌన్ టైమ్ లో పెళ్లి చేసుకున్నాడు నితిన్. కానీ హనీమూన్ చేసుకోవడం అవ్వలేదు. దీంతో పెళ్లి తర్వాత దంపతులిద్దరూ ఇంటికే పరిమితమైపోయారు. ఆ తర్వాత నితిన్ సినిమా సెట్స్ పైకి వచ్చేశాడు. రంగ్ దే షెడ్యూల్ తో పాటు చెక్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. మరి వీళ్ల హనీమూన్ ఎప్పుడు? సరిగ్గా ఇక్కడే నితిన్ ఓ ప్లాన్ వేశాడు. రంగ్ దే సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూట్ ను దుబాయ్ లో ప్లాన్ […]

ఇటు షూటింగ్... అటు హనీమూన్...
X

లాక్ డౌన్ టైమ్ లో పెళ్లి చేసుకున్నాడు నితిన్. కానీ హనీమూన్ చేసుకోవడం అవ్వలేదు. దీంతో పెళ్లి తర్వాత దంపతులిద్దరూ ఇంటికే పరిమితమైపోయారు. ఆ తర్వాత నితిన్ సినిమా సెట్స్ పైకి వచ్చేశాడు. రంగ్ దే షెడ్యూల్ తో పాటు చెక్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. మరి వీళ్ల హనీమూన్ ఎప్పుడు? సరిగ్గా ఇక్కడే నితిన్ ఓ ప్లాన్ వేశాడు.

రంగ్ దే సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూట్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. దీంతో ఆ షూటింగ్ కోసం భార్యతో కలిసి దుబాయ్ వెళ్లాడు నితిన్. అంటే.. సాంగ్ షూటింగ్ అయిన తర్వాత యూనిట్ అంతా హైదరాబాద్ వచ్చేస్తుంది కానీ, నితిన్ దంపతులు మాత్రం దుబాయ్ లోనే ఉండిపోతారన్నమాట.

ఇలా ఇటు షూటింగ్, అటు హనీమూన్ రెండింటినీ కవర్ చేసేలా అదిరిపోయే ప్లాన్ వేశాడు నితిన్. దుబాయ్ షెడ్యూల్ తో రంగ్ దే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక దుబాయ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత చెక్ సినిమా స్టార్ట్ చేస్తాడు.

First Published:  24 Nov 2020 8:30 PM GMT
Next Story