పండగ చేసుకుంటున్న మిడిల్ క్లాస్…

ఊహించని విధంగా హిట్టయింది మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమా. సున్నితమైన భావోద్వేగాలు, పక్కా లోకల్ సన్నివేశాలు, కామన్ మేన్ కు కూడా కనెక్ట్ అయ్యే స్టోరీలైన్ కావడంతో మూవీకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో హీరో ఆనంద్ దేవరకొండ ఆనందానికి హద్దులేదు. రోజుకో పార్టీ చేసుకుంటున్నాడు ఈ హీరో.

ఇప్పటికే యూనిట్ తో కలిసి పలు పార్టీల్లో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ, తాజాగా విజయ్ దేవరకొండకు చెందిన టీమ్స్ తో కూడా పార్టీలు చేస్తున్నాడు. వీటికితోడు ఇప్పుడు హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా సీన్ లోకి ఎంటరైంది. తాజాగా అంతా కలిసి విజయ్ దేవరకొండ ఇంట్లోనే పార్టీ చేసుకున్నారు.

దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. కానీ ఆ సినిమా సరిగ్గా వర్కవుట్ కాలేదు. ఈసారి తన రెండో ప్రయత్నంగా మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమా చేసి హిట్ కొట్టాడు ఈ హీరో. మొత్తమ్మీద దేవరకొండ నివాసంలో నటులిద్దరూ సక్సెస్ ఫుల్ హీరోస్ అనిపించుకున్నారు.