అది పునర్జన్మల కాన్సెప్ట్ అంట….

శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టుకు సంబంధించి రోజుకో అప్ డేట్ బయటకొస్తోంది. నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో శ్యామ్, సింగ్, రాయ్ అనే 3 పాత్రల్ని నానినే పోషిస్తున్నాడు. ఇప్పుడీ మూడు పాత్రల మధ్య లింక్ బయటకొచ్చింది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టు పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందట. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో రెండు పాత్రలు ఈ కాలానికి చెందినవే ఉంటాయి కానీ, మరో పాత్ర మాత్రం మరోసారి పుట్టి.. ఈ రెండు పాత్రల మధ్యకు ప్రవేశిస్తుందని చెబుతున్నారు.

ఇలా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్, కథతో శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టు రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా చేతులు మారిన సంగతి తెలిసిందే. లెక్కప్రకారం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాని హీరోగా ఈ సినిమా రావాలి. బడ్జెట్ తగ్గించుకోమని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ డిమాండ్ చేయడంతో, ఈ ప్రాజెక్టును తీసుకెళ్లి నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు అప్పగించాడు నాని. ఇందులో ఓ హీరోయిన్ గా సాయిపల్లవి ఎంపికైన సంగతి తెలిసిందే.