90 రోజుల్లో ఆదిపురుష్ నిజమేనా?

”ఆదిపురుష్” ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్. ”రాధేశ్యామ్” మూవీకి సంబంధించి రీసెంట్ గా ఫారిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ప్రభాస్, అట్నుంచి అటు ముంబయి వెళ్లి ”ఆదిపురుష్” టీమ్ తో సమావేశమయ్యాడు. ఆ టైమ్ లోనే సినిమాకు సంబంధించి చాలా అంశాల్ని ఫైనలైజ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది.

”ఆదిపురుష్” షూటింగ్ ను జస్ట్ 90 రోజుల్లో పూర్తిచేయాలని కండిషన్ పెట్టాడట ప్రభాస్. తను 3 నెలలు మాత్రమే కాల్షీట్లు ఇస్తానని, ఆ టైమ్ లోనే తనకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తిచేయాలని ప్రభాస్ సూచించాడట. దీనికి దర్శకుడు ఓం రౌత్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

”ఆదిపురుష్” సినిమాకు సంబంధించి మ్యాగ్జిమమ్ షూటింగ్ గ్రీన్ మ్యాట్ లో పూర్తిచేయబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. మూవీకి సంబంధించి ఔట్ డోర్ షూటింగ్ చాలా తక్కువగా షెడ్యూల్ చేశారు. అది కూడా శ్రీలంకలో కేవలం 2 వారాల ఔట్ డోర్ షూట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

అందుకే ప్రభాస్ కండిషన్ కు దర్శకుడు ఒప్పుకున్నట్టు సమాచారం. రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. త్వరలోనే హీరోయిన్ ఎవరనే విషయాన్ని ప్రకటించనున్నారు.