పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టాడు

ఓవైపు సినిమాల్లో నటిస్తూ, ఆ వచ్చే డబ్బులతో వేరే వ్యాపారాలు చేయడం హీరోలకు కొత్తకాదు. నిన్నగాక మొన్నొచ్చిన ఆనంద్ దేవరకొండ కూడా ఈ విషయాన్ని తొందరగా ఒంటబట్టించుకున్నాడు. ”మిడిల్ క్లాస్ మెలొడీస్” సినిమాలో నటించినందుకు గాను తనకొచ్చిన పారితోషికాన్ని తీసుకొచ్చి నేరుగా ఓ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాడు.

“గుడ్ వైబ్స్ ఓన్లీ” అనే కేఫ్ లో పెట్టుబడులు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. ఈ కేఫ్ ను ఆనంద్ దేవరకొండ స్నేహితులే నడిపిస్తున్నారు. అందులో తాజాగా పార్టనర్ గా మారాడు ఆనంద్.

ఆనంద్ దేవరకొండ అన్నయ్య విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఇలాంటి బిజినెస్ లు చాలా స్టార్ట్ చేశాడు. అతడికి సొంతంగా రౌడీ బ్రాండ్ ఉంది. రీసెంట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ బిజినెస్ లోకి కూడా ఎంటరయ్యాడు. ఇవి కాకుండా.. నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఇప్పుడు అన్న బాటలో తమ్ముడు కూడా చేరాడన్నమాట.