Telugu Global
International

ఆరంజ్ సిటీలో... అతిపెద్ద ఆరంజ్ పండు !

సాధారణంగా ఆరంజ్ (కమలాపండు) పరిమాణం మన చేతిలో ఇమిడేంత మాత్రమే ఉంటుంది. ఇంకాస్త పెద్దగా ఉండవచ్చు. కానీ నాగపూర్ లోని ఓ పళ్ల తోటలో ఆశ్చర్యకరమైన పరిమాణంలో ఆరంజ్ కాచింది. మహారాష్ట్రలోని నాగపూర్ కమలా పళ్ల తోటలకు ప్రసిద్ధి. అందుకే దీనిని ఆరంజ్ సిటీ అంటారు. ఇక్కడి ఓ తోటలో అతి పెద్ద సైజులో కాచిన కమలా పండు… చూసిన వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని చుట్టుకొలత 24 అంగుళాలు కాగా ఎత్తు 8 అంగుళాలు. రీతు […]

ఆరంజ్ సిటీలో... అతిపెద్ద ఆరంజ్ పండు !
X

సాధారణంగా ఆరంజ్ (కమలాపండు) పరిమాణం మన చేతిలో ఇమిడేంత మాత్రమే ఉంటుంది. ఇంకాస్త పెద్దగా ఉండవచ్చు. కానీ నాగపూర్ లోని ఓ పళ్ల తోటలో ఆశ్చర్యకరమైన పరిమాణంలో ఆరంజ్ కాచింది. మహారాష్ట్రలోని నాగపూర్ కమలా పళ్ల తోటలకు ప్రసిద్ధి. అందుకే దీనిని ఆరంజ్ సిటీ అంటారు.

ఇక్కడి ఓ తోటలో అతి పెద్ద సైజులో కాచిన కమలా పండు… చూసిన వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని చుట్టుకొలత 24 అంగుళాలు కాగా ఎత్తు 8 అంగుళాలు. రీతు మల్హోత్రా అనే పారిశ్రామిక వేత్త ఈ పండు గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన ఫ్రెండ్ తోటలో అది కాచినట్టుగా ఆమె పేర్కొన్నారు. ఆ కమలా పండు బరువు 1 కేజీ 425 గ్రాములుంది. ట్విట్టర్లో ఈ పండుని చూసిన నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ స్పందిస్తున్నారు.

ఇప్పటివరకు అతిపెద్ద ఆరంజ్ గా గిన్నిస్ బుక్ లో ప్రపంచరికార్డు సాధించిన ఆరంజ్ పండు చుట్టుకొలత 25 అంగుళాలు. 2006 జనవరి 22న కాలిఫోర్నియాకు చెందిన పాట్రిక్, జాన్నే పేర్లపైన ఈ రికార్డు నమోదైంది. నాగపూర్ ఆరంజ్ చుట్టుకొలత దానికి దగ్గరగా 24 అంగుళాలు ఉండటం విశేషం. భవిష్యత్తులో కాలిఫోర్నియా ఆరంజ్ రికార్డుని మన దేశపు కమలాపండు అధిగమించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి.

First Published:  25 Nov 2020 8:30 PM GMT
Next Story