మా కొండల్రావ్ ఎక్కడ…

“మిడిల్ క్లాస్ మెలొడీస్” రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కొచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో యూనిట్ అంతా పండగ చేసుకుంటోంది. ఎక్కడ చూసినా ఆనంద్ దేవరకొండ కేక్ కట్ చేస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. దీనికితోడు ఇప్పుడు హీరోయిన్ వర్ష కూడా చేరింది.

తాజాగా యూనిట్ కు చెందిన కీలక సభ్యులంతా కలిసి ఆనంద్ దేవరకొండ ఇంట్లోనే మరో సక్సెస్ పార్టీ పెట్టుకున్నారు. ఈసారి హీరోహీరోయిన్లకు తోడు ఆనంద్ దేవరకొండ తల్లి, తండ్రి కూడా ఫొటోలకు పోజులిచ్చారు.

సాధారణంగా ఈ ఫొటోల్లో తప్పుపడ్డాడానికేం లేదు. కానీ ”మిడిల్ క్లాస్ మెలొడీస్” సినిమా విషయానికొచ్చేసరికి మాత్రం ప్రేక్షకులు ఆనంద్ దేవరకొండను హీరోగా చూడడం లేదు, వాళ్ల దృష్టిలో హీరో తండ్రి కొండల్రావు (అసలు పేరు రమణ) అసలు హీరో.

సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచిన కొండల్రావు లేకుండా ఈ సక్సెస్ సంబరాలు, ఫొటోలు చేసుకోవడానికి ఎలా మనసొస్తోందంటూ ట్రోలింగ్ షురూ చేశారు నెటిజన్లు. నిజమే.. ఈ సక్సెస్ లో కచ్చితంగా షేర్ అందుకోవాల్సిన వ్యక్తి రమణ. ఆయన సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోల్లో లేకపోవడం బాధాకరమే.