నేను కోరుకున్న జీవితం ఇదే

ఇన్నాళ్లకు తను కోరుకున్న జీవితంలోకి ఎంటరయ్యానంటోంది హీరోయిన్ పూజా హెగ్డే. రెస్ట్ లేకుండా సినిమాలు చేయడంతో పాటు, ఆ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయ్యే టైమ్ లో జీవించాలని కోరుకున్నానని.. ప్రస్తుతం ఆ లైఫ్ ను టేస్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

2012లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది పూజా. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా అన్నీ ఫ్లాపులే. చివరికి హృతిక్ లాంటి స్టార్ హీరోతో చేసినా ఫ్లాప్ కొట్టింది. దీంతో ఆమెపై ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది.

అలాంటి పరిస్థితి నుంచి మెల్లమెల్లగా కోలుకొని ప్రస్తుతం సూపర్ హిట్ హీరోయిన్ అనిపించుకునే స్థాయికి చేరుకుంది పూజా హెగ్డే. ఈ పొజిషన్ ఎన్నాళ్లు ఇలా ఉంటుందో తనకు తెలియదని, కానీ ఈ ఫేజ్ ను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. సినిమాలు హిట్టవుతుంటే.. మరింత కష్టపడాలనే ఉత్సాహం వస్తుందంటోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అఖిల్, ప్రభాస్ సినిమాలున్నాయి. అటు బాలీవుడ్ లో సల్మాన్, రణ్వీర్ సింగ్ సినిమా అవకాశాలు అందుకుంది ఈ బుట్టబొమ్మ.