మరోసారి అదరగొట్టిన అడివి శేష్

దాదాపు రెండేళ్లుగా ఒకే ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడు అడవి శేష్. అదే మేజర్ మూవీ. ఇప్పుడీ సినిమాకు సంబంధించి లుక్ టెస్ట్ పేరిట ఓ ఫొటో రిలీజ్ చేశారు. ఆ ఫొటోలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గెటప్ లో అడివి శేష్ సరిగ్గా సరిపోయాడు.

ఓవైపు సగం ముఖం మేజర్ సందీప్ ది పెట్టి, మిగతా సగం ముఖం అడవి శేష్ ది పెట్టారు. తద్వారా ఈ రోల్ కు అడివి శేష్ ఎంత బాగా సూట్ అయ్యాడనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఈ పాత్ర కోసం అడివి శేష్ బాగా కండలు పెంచాడు. ఫిట్ గా తయారయ్యాడు.

మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతోంది మేజర్ మూవీ. శశికిరణ్ తిక్క దర్శకుడు. సోనీ పిక్చర్స్, ఏ-ప్లస్ మూవీస్ సంస్థలు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు.

లుక్ టెస్ట్ లో భాగంగా మేజర్ మూవీ కోసం తను పడిన శ్రమ, మేజర్ సందీప్ తల్లిదండ్రులతో మాట్లాడిన మాటల్ని వీడియో రూపంలో బయటపెట్టాడు శేష్.