సంక్రాంతి నుంచి మరో సినిమా ఔట్

సంక్రాంతికి వస్తున్నామంటూ ఎంత ఆర్భాటంగా ప్రకటించారో, ఇప్పుడు అంతే సైలెంట్ గా తప్పుకుంటున్నారు ఒక్కొక్కరు. నెల రోజుల కిందట పరిస్థితి చూస్తే.. సంక్రాంతికి ఏకంగా 7 సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. కానీ వాటి నుంచి ఒక్కొక్కటి తప్పుకుంటున్నాయి. తాజాగా ఇలా తప్పుకున్న లిస్ట్ లోకి కేజీఎఫ్2 కూడా చేరింది.

అవును.. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి వచ్చేలా కనిపించడం లేదు. ఓవైపు షూటింగ్ శరవేగంగా నడుస్తున్నప్పటికీ.. మిగిలిన ఈ నెల రోజుల్లో సినిమాను రెడీ చేయడం కష్టమని యూనిట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈరోజు రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ మొదలైంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. అయినప్పటికీ నెల రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవ్వడం కష్టం అంటున్నారు. సో.. సంక్రాంతి రేసు నుంచి కేజీఎఫ్2 కూడా బయటపడినట్టే అనుకోవాలి.