పవన్ ఓ ఊసరవెల్లి – ప్రకాష్ రాజ్

ఊహించని విధంగా పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్. ఎప్పటికప్పుడు మాట మారుస్తున్న పవన్ కల్యాణ్… ఊసరవెల్లిని తలపిస్తున్నారని విమర్శించారు.

2014లో టీడీపీ-బీజేపీని సమర్థించారు పవన్. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీని తీవ్రంగా విమర్శించారు. కట్ చేస్తే, ఏడాదికే మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. ఇలా ఇన్ని సార్లు మాట మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్.

పవన్ ను తను ఎప్పుడూ ఓ లీడర్ గా చూస్తానని, ఆయనకంటూ ఓ పార్టీ ఉందని.. అలాంటప్పుడు బీజేపీ భుజాలపైకి పవన్ ఎక్కాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు ప్రకాష్ రాజ్.

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ షేర్ పరంగా చూసుకుంటే, మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం పవన్ కల్యాణ్ కు లేదంటూనే.. ఆయన రాజకీయ విధానాలు బాగాలేవంటూ సూటిగా విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్.