ఇది ఫిక్స్… బాలీవుడ్ కు బెల్లంకొండ

దర్శకుడు వీవీ వినాయక్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడనే విషయం మొన్ననే బయటకు వచ్చింది. ఇప్పుడీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. తెలుగులో బెల్లంకొండను హీరోగా పరిచయం చేసిన వినాయక్, ఇప్పుడు అతడ్ని బాలీవుడ్ కు పరిచయం చేసే బాధ్యతను కూడా భుజానికెత్తుకున్నాడు.

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు వినాయక్. ఈ మేరకు ఆల్రెడీ సిట్టింగ్స్ మొదలయ్యాయి. చిన్నచిన్న మార్పులు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాను, పెన్ మూవీస్ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతోంది. సినిమాలో హీరోయిన్ ఎవరు.. మ్యూజిక్ ఎవరు అందిస్తారు లాంటి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ ప్రాజెక్టును సుజీత్ హ్యాండిల్ చేయాలి. కానీ సెంటిమెంట్ కొద్దీ వినాయక్ చేతిలో ప్రాజెక్టు పెట్టారు. అటు లూసిఫర్ రీమేక్ ఛాన్స్ ను చేజార్చుకొని ఖాళీగా ఉన్న వినాయక్ వెంటనే దీనికి ఓకే చెప్పాడు.