Telugu Global
National

చంద్రబాబు అసెంబ్లీ హాజరు అనుమానమే..?

ఈనెల 30నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. మూడు రాజధానుల వ్యవహారం, స్థానిక ఎన్నికలు.. తాజాగా వరద నష్టం… ఇవే ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రతిపక్షనేత చంద్రబాబు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే విషయం అనుమానంగా మారింది. సమావేశాల సన్నాహకంగా ఏర్పాటు చేస్తున్న టీడీఎల్పీ మీటింగ్ కూడా ఆన్ లైన్ లోనే ఏర్పాటు చేసుకోవడం దీనికి బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు అమరావతిలోనే ఉన్నా […]

చంద్రబాబు అసెంబ్లీ హాజరు అనుమానమే..?
X

ఈనెల 30నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. మూడు రాజధానుల వ్యవహారం, స్థానిక ఎన్నికలు.. తాజాగా వరద నష్టం… ఇవే ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి.

ఈ నేపథ్యంలో అసలు ప్రతిపక్షనేత చంద్రబాబు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే విషయం అనుమానంగా మారింది. సమావేశాల సన్నాహకంగా ఏర్పాటు చేస్తున్న టీడీఎల్పీ మీటింగ్ కూడా ఆన్ లైన్ లోనే ఏర్పాటు చేసుకోవడం దీనికి బలం చేకూరుస్తోంది.

ప్రస్తుతం చంద్రబాబు అమరావతిలోనే ఉన్నా ఎవరినీ నేరుగా కలవడం లేదు. ఇటీవల కాలంలో చంద్రబాబు నేరుగా కలిసింది ఒక్క తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి దంపతుల్ని మాత్రమే. ఎంత పెద్ద నేతలయినా బాబుని కలవాలంటే దానికి జూమ్ ఒక్కటే మార్గంగా మారింది. జూమ్ ద్వారానే నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడుతున్న చంద్రబాబు.. ఇప్పుడు టీడీఎల్పీ మీటింగ్ ని కూడా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తుండే సరికి.. అసలు చంద్రబాబు అసెంబ్లీకి వస్తారా? రారా? అనే అనుమానం నేతల్లో నెలకొంది.

కరోనా ప్రభావం మొదలైన తర్వాత చంద్రబాబు ఎవరినీ నేరుగా కలవలేదు. ఓ దఫా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని మాత్రం నేరుగా పరామర్శించిన బాబు, అప్పటినుంచి పూర్తిగా ఇంటి పట్టునే ఉంటున్నారు. హైదరాబాద్-అమరావతి మధ్య షటిల్ సర్వీసు చేస్తున్నా.. ఎక్కడా ఎవర్నీ నేరుగా కలవడంలేదు.

జూమ్ మీటింగ్ లో బ్యాక్ గ్రౌండ్ మారినప్పుడు మాత్రమే బాబు అమరావతిలో ఉన్నారా, హైదరాబాద్ లో ఉన్నారా అనే విషయం కార్యకర్తలకు చూచాయగా అర్థమవుతోంది. ఆయన టూర్ వివరాలు కూడా కేవలం పార్టీ వర్గాలకే చెబుతున్నారు, ఎవరినీ నేరుగా కలిసే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

దీంతో ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు బాబు హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు అసెంబ్లీకి ఎప్పుడూ గైర్హాజరైన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు కరోనా జాగ్రత్తల వల్ల.. తొలిసారి చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు దూరం కాబోతున్నారు.

First Published:  28 Nov 2020 4:23 AM GMT
Next Story