రాహుల్… ముగ్గురు అమ్మాయిలు… ఓ డేటింగ్

బిగ్ బాస్ సీజన్-4 కూడా క్లైమాక్స్ కొచ్చింది. అయినప్పటికీ సీజన్-3 విన్నర్ రాహుల్ కు ఇంకా క్రేజ్ తగ్గలేదు. అతడ్ని ఇంటర్వ్వూ చేసేందుకు యూట్యూబ్ ఛానెళ్లు ఇప్పటికీ ఎగబడుతున్నాయి. తన క్రేజ్ కు తగ్గట్టే రాహుల్ కూడా.. అన్ని విషయాలు ఒకేసారి కాకుండా.. ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తున్నాడు. తాజాగా తన ఎఫైర్లపై స్పందించాడు రాహుల్.

రాహుల్-పునర్నవి రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్ లో వీళ్లు సాగించిన సరసాలు చాలామందికి గుర్తే. బయటకొచ్చిన తర్వాత మాత్రం పునర్నవి తనకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పేశాడు రాహుల్. అటు పున్నూ కూడా అదే మాటపై నిలబడింది.

కట్ చేస్తే, ఇప్పుడు కొత్తగా అషు రెడ్డితో డేటింగ్ స్టార్ట్ చేశాడు రాహుల్. రీసెంట్ గా ఇద్దరూ దిగిన ఫొటోను షేర్ చేసి, లవ్ సింబల్ ఎమోజీ కూడా తగిలించాడు. అయితే ఇది కూడా రిలేషన్ షిప్ కాదంటున్నాడు రాహుల్. అషు తనకు ఫ్రెండ్ కంటే ఎక్కువంట, గర్ల్ ఫ్రెండ్ కంటే కాస్త తక్కువంట. ఇదీ రాహుల్ సమాధానం.

ఈ రెండు రిలేషన్ షిప్స్ మధ్యలో రాములమ్మ శ్రీముఖిపై కూడా స్పందించాడు రాహుల్. తను, శ్రీముఖి ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉండేవాళ్లమని, కానీ ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా అయిపోయామని చెప్పుకొచ్చాడు.