కియరాపై కన్నేసిన బెల్లంకొండ

బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ ఫిక్స్ అయింది. దర్శకుడు ఎవరనేది కూడా ఫిక్స్ అయింది. ఏ సినిమా రీమేక్ విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక స్పష్టత రావాల్సింది ఒకే ఒక్క అంశం మీద. అదే హీరోయిన్ ఎవరనే అంశం. ఇప్పుడీ కోణంలో కూడా చిన్నపాటి క్లారిటీ వచ్చేలా ఉంది.

ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ, బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బెల్లంకొండ. ఈ ప్రాజెక్టుకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పుడీ సినిమాలోకి కియరా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో కియరా క్రేజ్ బాగానే నడుస్తోంది. ఆమె సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలుకొట్టకపోయినా.. 2 సినిమాలు అసలు థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసినా.. కియరాకు క్రేజ్ మాత్రం ఉంది.

ఇప్పుడా క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది బెల్లంకొండ యూనిట్. ప్రస్తుతానికైతే చర్చలు షురూ చేశారు. ఏం జరుగుతుందో చూడాలి.