ప్రభాస్ కు సీత దొరికేసింది

ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ కు దాదాపు తెరపడింది. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కృతి సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఇక రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడు. ఇప్పుడు సీత పాత్రలో కృతి సనన్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అంటోంది బాలీవుడ్ మీడియా.

నిజానికి ఈ పాత్ర కోసం గతంలో అనుష్క, కీర్తిసురేష్, కియరా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ తనకు ఆదిపురుష్ కు సంబంధం లేదని అనుష్క ఆల్రెడీ ప్రకటించింది. కీర్తి, కియరా కూడా దాదాపు తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కృతి సనన్ పేరు తెరపైకొచ్చింది.

మహేష్ నటించిన వన్-నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమా చేసింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైపోయింది.