నాగశౌర్య కూడా అక్కడికే జంప్

మహేష్ వెళ్లొచ్చాడు. ఎన్టీఆర్ కూడా వెళ్లాడు. ఇప్పుడు నితిన్ అక్కడే ఉన్నాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి నాగశౌర్య కూడా చేరిపోయాడు. అవును.. శౌర్య కూడా సూట్ కేస్ సర్దుకున్నాడు. దుబాయ్ ట్రిప్ కు రెడీ అయ్యాడు.

ప్రస్తుతం ‘వరుడు కావలెను’ అనే సినిమా చేస్తున్నాడు శౌర్య. లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి దుబాయ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు నాగశౌర్య అక్కడకి వెళ్లాడు.

అయితే షూటింగ్ తో పాటు కాస్త సేదతీరే కార్యక్రమం కూడా పెట్టుకున్నాడు శౌర్య. 8 నెలలుగా ఇంటికే పరిమితమైపోయిన ఈ హీరో.. ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్స్ తో బిజీ అయ్యాడు. ప్రస్తుతం చేస్తున్న షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత దుబాయ్ లోనే కొన్ని రోజులు ఉండి రాబోతున్నాడు.

ఈ సీజన్ లో దుబాయ్ లో వాతావరణం బాగుంటుంది. అందుకే షూటింగ్స్, సేదతీరడాలు అన్నీ అక్కడే అంటున్నారు టాలీవుడ్ జనం.