రవితేజ నుంచి ఒకేసారి 2 సినిమాలు

వరుస ఫ్లాపుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రవితేజ, మళ్లీ తన ఓల్డ్ స్టయిల్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ సీనియర్ హీరో.. త్వరలోనే ఒకేసారి రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించాడు. ఇన్నాళ్లూ కరోనా వల్ల కోల్పోయిన సమయాన్ని ఇప్పుడు రెండు సినిమాలతో భర్తీ చేయాలనుకుంటున్నాడు రవి.

క్రాక్ సినిమాను పూర్తిచేశాడు రవితేజ. సంక్రాంతికి ఆ సినిమా వస్తోంది. ఇప్పుడు అతడి చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా బ్యానర్ పై చేయాలి. ఇక రెండోది రమేశ్ వర్మ దర్శకత్వంలో చేయాల్సిన ఖిలాడీ సినిమా.

ఇప్పుడీ రెండు సినిమాల్ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించాడు రవితేజ. రెండు సినిమాలకు మినిమం గ్యాప్స్ లో కాల్షీట్లు కేటాయిస్తూ, ఒకేసారి పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే.. క్రాక్ తో కలుపుకొని వచ్చే ఏడాది రవితేజ నుంచి 3 సినిమాలు రాబోతున్నాయన్నమాట.