Telugu Global
National

మీ భవిష్యత్​ కోసం ఓటేయండి!... సోషల్​మీడియాలో సెలబ్రిటీల పోస్టులు

ఓటు మనహక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా . ఐదేళ్లు మనల్ని పాలించే వాళ్ల కోసం ఎన్నుకొనే ఓ అరుదైన అవకాశం. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ఉపన్యాసాలు దంచే చాలా మంది ఓటువేయడానికి ఇబ్బంది పడతారు. క్యూలైన్​లో నిలబడటానికి ఇష్టపడరు. పల్లెటూర్లతో పోల్చుకుంటే పట్టణాల్లో, నగరాల్లో విద్యావంతులు ఎక్కువ. కానీ ఓట్లశాతం మాత్రం నగరాల్లో చాలా తక్కువగా ఉంటుంది. అందుకు కారణం నగర యువత నిర్లక్ష్యధోరణే. సాధారణ రోజుల్లో రోడ్లు బాగాలేవు… అవినీతి పెరిగిపోయింది… అంటూ […]

మీ భవిష్యత్​ కోసం ఓటేయండి!... సోషల్​మీడియాలో సెలబ్రిటీల పోస్టులు
X

ఓటు మనహక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా . ఐదేళ్లు మనల్ని పాలించే వాళ్ల కోసం ఎన్నుకొనే ఓ అరుదైన అవకాశం. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ఉపన్యాసాలు దంచే చాలా మంది ఓటువేయడానికి ఇబ్బంది పడతారు. క్యూలైన్​లో నిలబడటానికి ఇష్టపడరు. పల్లెటూర్లతో పోల్చుకుంటే పట్టణాల్లో, నగరాల్లో విద్యావంతులు ఎక్కువ. కానీ ఓట్లశాతం మాత్రం నగరాల్లో చాలా తక్కువగా ఉంటుంది. అందుకు కారణం నగర యువత నిర్లక్ష్యధోరణే.

సాధారణ రోజుల్లో రోడ్లు బాగాలేవు… అవినీతి పెరిగిపోయింది… అంటూ సోషల్​మీడియాలో విరుచుకుపడే యువత ఓట్లు వేసేందుకు మాత్రం ముందుకురారు. ఓటు వేయడాన్ని ఓ నామోషీగా ఫీలవుతారు. అందుకే పల్లెటూర్లతో పోల్చుకుంటే పట్టణాల్లో ఓటింగ్​ శాతం చాలా తక్కువగా ఉంటుంది.

అయితే వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు పలువురు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. ఓట్లే వేయకుండా ప్రభుత్వాలు బాగా లేవని విమర్శించడం సరికాదని సూచిస్తున్నారు.

తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్​ కమ్ముల, యాంకర్​ ఉదయభాను ఓటుహక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలంతా ముందుకొచ్చి ఓట్లు వేయాలని.. తమకు ఇష్టమైన నేతలను ఎన్నుకోవాలని వాళ్లు సూచిస్తున్నారు. ఈ విషయంపై శేఖర్​ కమ్ముల కొంచెం సాఫ్ట్​గా చెప్పగా.. ఉదయభాను మాత్రం ఓటు విషయంపై కాస్త ఘాటుగానే అవగాహన కల్పించారు. మీ ఓటును వందకో… వెయ్యికో… అమ్ముకోకండి… అంటూ ఆమె పేర్కొన్నారు. మీరు ఓటును అమ్ముకుంటే మీ జీవితాన్ని అమ్ముకున్నట్టేనని కొంచెం ఘాటుగానే స్పందించారు.

‘మన నగరాన్ని నిజంగా ప్రేమిస్తే… మనం తప్పకుండా డిసెంబరు 1వ తేదీన ఓటు వేయాలి’ అంటూ శేఖర్​ కమ్ముల సూచించారు.

‘జీవితం ఒక యుద్ధం. దాన్ని గెలవడానికి ఓటు ఓ ఆయుధం. దాన్ని నిర్వీర్యం చేయకండి. ప్రలోభాలకు లొంగకండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ ఉదయభాను పిలుపునిచ్చారు.

First Published:  29 Nov 2020 1:13 AM GMT
Next Story