Telugu Global
Health & Life Style

కరోనా పరీక్షల్లో కోటి మార్కు దాటిన ఏపీ..

కొవిడ్ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో మైలురాయిని అధిగమించింది. కోటిమందికి పైగా కొవిడ్ నిర్థారణ పరీక్షలు జరిపిన రాష్ట్రాల సరసన ఏపీ కూడా చేరింది. కోటి పరీక్షలు చేసిన ఆరో రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ లో 1,00,17,126 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా వీరిలో 8,67,683 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,397 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకూ 6,988మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. […]

కరోనా పరీక్షల్లో కోటి మార్కు దాటిన ఏపీ..
X

కొవిడ్ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో మైలురాయిని అధిగమించింది. కోటిమందికి పైగా కొవిడ్ నిర్థారణ పరీక్షలు జరిపిన రాష్ట్రాల సరసన ఏపీ కూడా చేరింది. కోటి పరీక్షలు చేసిన ఆరో రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ లో 1,00,17,126 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా వీరిలో 8,67,683 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,397 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకూ 6,988మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు.

కొవిడ్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో.. అత్యథిక పాజిటివ్ కేసులతో ఏపీ కూడా ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మహారాష్ట్ర తర్వాత అత్యథిక కేసులున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. అయితే లాక్ డౌన్ నిబంధనలు సక్రమంగా అమలు చేయడంతోపాటు, కరోనా పరీక్షల సంఖ్య పెంచి, పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్ కి తరలించడంతో మహమ్మారి కట్టడి సాధ్యమైంది. టెస్ట్ కిట్ ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండానే.. రాష్ట్రీయంగా కొవిడ్ నిర్థారణ కిట్ ల తయారీని అతి వేగంగా ప్రారంభించిన రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది ఏపీ. ప్రతి 10లక్షల జనాభాలో.. 1,87,587 మందికి ఏపీలో కొవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. ఏపీలో పాజిటివిటీ రేటు 8.66 కాగా, దేశవ్యాప్త పాజిటివిటీ రేటుకి ఇది 1.93 అదనం. ఇక మరణాల సంఖ్య కూడా ఏపీలో అత్యల్పంగా నమోదు కావడం సంతోషించదగ్గ విషయం. దేశవ్యాప్తంగా కరోనా మరణాల శాతం 1.46గా ఉండగా.. ఏపీలో మరణాల శాతం కేవలం 0.81 మాత్రమే. అంటే ఏపీలో కరోనా సోకిన ప్రతి 100మందిలో 99మంది సురక్షితంగా కోలుకోగలుగుతున్నారనమాట.

ఇక రికవరీ రేటులో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఏపీలో రికవరీ రేటు 98.23 శాతంగా ఉంది. ఏపీ తర్వాత ఒడిశా, అసోం, బీహార్.. మాత్రమే ఆ స్థాయిలో రికవరీ రేటు కలిగి ఉన్నాయి. మొత్తమ్మీద కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ కోటి మార్కుని చేరుకోవడం, రికవరీ రేటులో ప్రథమ స్థానంలో ఉండటం.. జాతీయ సగటుకంటే మరణాల శాతం అతి తక్కువగా ఉండటం ఏపీ ప్రజలు సంతోషించదగ్గ విషయం.

First Published:  29 Nov 2020 9:04 PM GMT
Next Story