Telugu Global
NEWS

అమిత్ షా రాకతో మరింత అలజడి..

కేంద్ర మంత్రులు ప్రచారం చేసినా, పొరుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి మేనిఫెస్టో విడుదల చేసినా, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్ షో చేసినా.. గ్రేటర్ లో బీజేపీకి పెద్దగా కిక్కు లేదు. అదే అమిత్ షా వచ్చే సరికి ఆఖరి రోజు అలజడి రేగింది. ప్రత్యర్థి శిబిరంలో కూడా కలకలం మొదలైంది. ” తెలంగాణలో రోహింగ్యాలు ఉన్నారని నివేదిక ఇవ్వండి.. నేనేం చేస్తానో చూడండి” అంటూ ఘాటు వ్యాఖ్యలతో గ్రేటర్ ప్రచారాన్ని చివరిరోజు వేడెక్కించారు కేంద్ర హోం […]

అమిత్ షా రాకతో మరింత అలజడి..
X

కేంద్ర మంత్రులు ప్రచారం చేసినా, పొరుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి మేనిఫెస్టో విడుదల చేసినా, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్ షో చేసినా.. గ్రేటర్ లో బీజేపీకి పెద్దగా కిక్కు లేదు. అదే అమిత్ షా వచ్చే సరికి ఆఖరి రోజు అలజడి రేగింది. ప్రత్యర్థి శిబిరంలో కూడా కలకలం మొదలైంది.
” తెలంగాణలో రోహింగ్యాలు ఉన్నారని నివేదిక ఇవ్వండి.. నేనేం చేస్తానో చూడండి” అంటూ ఘాటు వ్యాఖ్యలతో గ్రేటర్ ప్రచారాన్ని చివరిరోజు వేడెక్కించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ప్రచారం ముగింపు రోజు హైదరాబాద్ లో సుడిగాలి పర్యటన చేసిన షా.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఆలయానికి వెళ్లడం, అది కూడా సున్నిత ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని ఎంచుకోవడంతో… ఓవర్గం వారిని అమిత్ షా ఆకర్షించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఎంఐఎం, టీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని విమర్శించారాయన. దమ్ముంటే బహిరంగంగానే పొత్తు పెట్టుకోవచ్చుకదా అని సవాల్ విసిరారు.

కేంద్రం నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు..
కేంద్రం ప్రభుత్వం అమలుచేసే పథకాలకు తెలంగాణలో ప్రవేశం లేకుండా చేసి, టీఆర్ఎస్ సర్కారు ప్రజల్ని మోసం చేస్తోందని అన్నారు అమిత్ షా. ప్రధాని మోదీకి పేరొస్తుందనే ఒకే ఒక్క కారణంతో తెలంగాణలో స్వాస్త్‌ యోజన పథకాన్ని అమలుచేయడం లేదన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ఫలాలు హైదరాబాద్‌ పేదలకు అందకుండా చేశారని, వరదలు వచ్చినపుడు హైదరాబాద్‌ కు రెండు విడతల్లో కేంద్రం రూ.500కోట్ల నిధులిచ్చిందని, పేదల గృహనిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారని, వీధి వ్యాపారులకోసం ప్రవేశ పెట్టిన పథకాన్ని టీఆర్ఎస్ తొక్కిపట్టిందని విమర్శించారు. అందరూ ఫామ్ హౌస్ కేసీఆర్ అని సెటైర్లు వేస్తే.. అమిత్ షా మాత్రం ఆయనెప్పుడైనా సచివాలయానికి వెళ్లారా అంటూ రివర్స్ లో టార్గెట్ చేశారు.

ఆక్రమణలు లేని హైదరాబాద్..
నగరాలు, పట్టణాల్లో కాల్వల ఆక్రమణలు, డ్రైనేజీ పక్కనే ఇళ్లు, చెరువులు పూడ్చి ఇళ్లు కట్టుకోవడం…. సర్వ సాధారణం. వీరిజోలికి వస్తే ఓట్లు పోతాయనే భయంతో అన్ని పార్టీలు చూసీ చూడనట్టు ఉంటాయి. అయితే అమిత్ షా మాత్రం.. తాము అధికారంలోకి వస్తే ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. కొంతమందికోసం 7లక్షలమంది ప్రజలు వరదల్లో నష్టపోతే చూస్తూ ఊరుకోలేం కదా అని అన్నారు అమిత్ షా. మేకిన్‌ ఇండియా ఫలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని, నగరానికి భవిష్యత్‌లో మరిన్ని ఐటీ సంస్థలు వచ్చేలా కృషిచేస్తామని, ఐటీ పరంగా తెలంగాణను ఓ ఐకాన్ లా మారుస్తామని హామీ ఇచ్చారు. ప్రచారం చివరిరోజు కావడం వల్లో లేక, బీజేపీ శ్రేణుల పక్కా ప్రణాళిక వల్లో తెలియదు కానీ.. అమిత్ షా పర్యటనకు భారీగా జనాల్ని తరలించారు. ఈ భారీ జన సమూహంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరగడంతోపాటు.. టీఆర్ఎస్ శిబిరంలో కలవరం మొదలైందని అంటున్నారు.

First Published:  29 Nov 2020 9:10 PM GMT
Next Story