Telugu Global
National

రైతుల ఆందోళనతో దిగొచ్చిన కేంద్రం! చర్చలకు సిద్ధమంటూ ప్రకటన

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా హర్యానా, పంజాబ్​ రాష్ట్రాల్లోని రైతులు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఈ ఉద్యమం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​కు కూడా పాకింది. గత గురువారం వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైతులపై పోలీసులు టియర్​గ్యాస్​, జలఫిరంగులు ప్రయోగించారు. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా రైతులు అక్కడి నుంచి కట్టుకదల్లేదు. […]

రైతుల ఆందోళనతో దిగొచ్చిన కేంద్రం! చర్చలకు సిద్ధమంటూ ప్రకటన
X

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా హర్యానా, పంజాబ్​ రాష్ట్రాల్లోని రైతులు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇటీవల ఈ ఉద్యమం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​కు కూడా పాకింది. గత గురువారం వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైతులపై పోలీసులు టియర్​గ్యాస్​, జలఫిరంగులు ప్రయోగించారు.

అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా రైతులు అక్కడి నుంచి కట్టుకదల్లేదు. ఢిల్లీ వెళ్లితీరతామంటూ భీష్మించుకు కూర్చున్నారు. రోజురోజుకూ ఆందోళన తీవ్రంగా మారుతుండంతో కేంద్రం దిగివచ్చినట్టు సమాచారం. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్​షా, రాజ్​నాథ్​ సింగ్​, నరేంద్రసింగ్​ తోమర్​ సమావేశమయ్యారు. డిసెంబర్​ 3న రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రప్రభుత్వం సంకేతాలు పంపింది. అయితే ఈ ప్రతిపాదనపై రైతుసంఘాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.

మరోవైపు రైతు సంఘాల ఆందోళనలు, కేంద్రం తీరుపై సోషల్​మీడియాలో ట్రోలింగ్​ సాగుతున్నది. రైతుల ఆందోళనతో ఢిల్లీ అట్టుడుకుతుంటే.. అమిత్​ షాకు హైదరాబాద్​లో ఏం పని? అంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు.

ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బేషరతుగా రైతులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఢిల్లీలోని సింఘు, టిక్రి బోర్డర్ పాయింట్ల వద్ద రైతులు చేపట్టిన ఆందోళన నాలుగోరోజుకు చేరుకున్నది. ఈ ఆందోళనకు ఆమ్​ఆద్మీపార్టీ మద్దతు తెలిపింది. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. జీహెచ్​ఎంసీ ఎన్నికలపై దృష్టిసారించిందని ఢిల్లీ సీఎం ఆరోపించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి అమిత్​షా హైదరాబాద్​లో రోడ్​షో నిర్వహించారని విమర్శించారు.

First Published:  30 Nov 2020 5:44 AM GMT
Next Story