మాల్దీవులకు సెలబ్రెటీల క్యూ వెనుక అసలు సీక్రెట్‌ !

కరోనా కాలంలో సెలబ్రెటీలు, సినిమా స్టార్లు ఇళ్లకే పరిమితమయ్యారు, షూటింగ్‌ లు లేవు. బయటకు పోయే పరిస్థితి లేదు. ఒక రకంగా వారికి పెద్ద శిక్షే పడింది.

లాక్‌డౌన్‌ తర్వాత ఆంక్షలు సడలించారు. కానీ పూర్తిస్థాయిలో షూటింగ్‌లు నడవడం లేదు. కొన్ని కొన్ని ప్యాచ్‌ వర్క్‌లు పూర్తి చేస్తున్నారు. ఈటైమ్‌లో ఎంజాయ్‌ చేయడానికి అంటూ టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ వరకు అందరూ మాల్దీవులకు క్యూ కడుతున్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో ఎవరి అకౌంట్‌ చూసినా మాల్దీవుల ఫొటోలే కనిపిస్తున్నాయి. సమంతా, నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు పలువురు టాలీవుడ్‌ సెలబ్రెటీలు మాల్దీవుల్లో సేదతీరారు. కరోనా టైమ్‌లో మాల్దీవుల్లో జల్సా చేయడం వెనుక సీక్రెట్‌ ఏంటి అని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

మాల్దీవులు పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన దేశం. కరోనాతో టూరిస్టులు తగ్గిపోయారు. ఆదాయం పడిపోయింది. దీంతో మళ్లీ వ్యాపారం పెంచుకునేందుకు ప్రీ ఆఫర్లు ఇస్తోందట. కొన్ని రిసార్ట్‌లు స్పెషల్ డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించాయట. అసలు మన సెలబ్రెటీలు ఆఫర్లు వస్తే వద్దనుకుంటారా? ఇంకేముంది చలో మాల్దీవులు అంటూ పుల్ ఎంజాయ్ చేస్తున్నారట.

అంతేకాదు కరోనా భయంతో పెద్దగా జనాలు బీచ్‌లకు రావడం లేదు. రిస్టార్‌ల వైపు చూడడం లేదు. అటు అఫర్లు… ఇటు ప్రీడమ్‌ దొరుకుతుందని ప్రముఖులు మాల్దీవులకు వెళ్ళేందుకు స్పెషల్‌ ప్లైట్‌లు బుక్‌ చేస్తున్నారట.