సమంతకు షాకిచ్చిన ప్రభాస్

సమంత ప్రస్తుతం ఓ టాక్ షో నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం ఆమె ఏకంగా కోటి 80లక్షల రూపాయల పారితోషికం అందుకుందని టాక్. అయితే ఇక్కడ కేవలం హోస్ట్ చేయడమే కాదు, సమంతకు తెరవెనక కూడా ఓ పని ఉంది. అదేంటంటే.. హీరోల్ని ఈ షోకు రప్పించే బాధ్యత కూడా ఆమెదే. అందుకే అంత మొత్తం ఇవ్వడానికి రెడీ అయ్యారన్నమాట.

ఇందులో భాగంగా తన పరిచయంతో విజయ్ దేవరకొండ, రానా, నాగ్ అశ్విన్ ను శామ్-జామ్ కార్యక్రమానికి రప్పించుకుంది సమంత. చిరంజీవి మాత్రం అల్లు అరవింద్ రిఫరెన్స్ తో వచ్చారు. అది వేరే సంగతి. ఇప్పుడు సమంత మరో స్టార్ హీరో కోసం ట్రై చేసింది. కానీ ఆమెకు చుక్కెదురైంది.

శామ్-జామ్ కార్యక్రమానికి ప్రభాస్ ను తీసుకురావాలనుకుంది సమంత. ఈ మేరకు సంప్రదింపులు కూడా ప్రారంభించింది. అయితే ప్రభాస్ మాత్రం మరో ఆలోచన లేకుండా ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు సమాచారం. ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని, ఇలాంటి టైమ్ లో సమంత ఇంటర్వ్యూకు రావడం తనకు కుదరదని తెగేసి చెప్పేశాడట.

మామూలుగానే ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవ్వడం ప్రభాస్ కు నచ్చదు. షూటింగ్ చేస్తాడు లేకపోతే ఇంట్లో పడుకుంటాడు. అంతేతప్ప ఇలాంటి ఎక్స్ ట్రా కార్యక్రమాలను అస్సలు ఎంకరేజ్ చేయడు. ఇప్పుడు నిజంగానే ప్రభాస్ షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో సింపుల్ గా నో చెప్పేశాడు.