ఆ హీరోయిన్ మళ్లీ మారిపోయింది

అనుపమ పరమేశ్వరన్ కు అస్సలు టైమ్ కలిసిరావడం లేదు. చేతి వరకు వచ్చిన సినిమాలు చేజారిపోతున్నాయి. ఇప్పుడు కార్తికేయ-2 ప్రాజెక్టు కూడా ఇలానే చేజారింది. మొన్నటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పేరు తెరపైకొచ్చింది. లాక్ డౌన్ టైమ్ లో ఈ విషయాన్ని ఆమె పరోక్షంగా వెల్లడించింది కూడా. కానీ ఇప్పుడు ఆమెను ప్రాజెక్టు నుంచి సైడ్ చేసినట్టు టాక్.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. కార్తికేయ-2 సినిమాలో అనుపమ పరమేశ్వరన్ స్థానంలో నివేత
పెతురాజ్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. నిఖిల్-అనుపమ కాంబినేషన్ కంటే.. నిఖిల్-నివేత కాంబో బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరీ ముఖ్యంగా నిఖిల్-అనుపమ కలిసి ఆల్రెడీ 18-పేజెస్ అనే సినిమా చేస్తున్నారు. మళ్లీ నెక్ట్స్ సినిమాకే అనుపమను రిపీట్ చేస్తే, ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశం ఉంది. అందుకే అనుపమను తప్పించి, ఆ స్థానంలో నివేత పెతురాజ్ ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సూపర్ హిట్ సీక్వెల్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తాయి. కాలభైరవ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.