నితిన్ పై పగ తీర్చుకుంటుందట

కొన్ని రోజుల కిందటి సంగతి.. షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాడు నితిన్. రంగ్ దే సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ ప్లాన్ చేశారు అక్కడ. షూటింగ్ గ్యాప్ లో కీర్తిసురేష్ రెస్ట్ తీసుకుంది. కళ్లపై తెల్లటి వస్త్రం కప్పుకొని కుర్చీలోనే పడుకుంది. నితిన్ అది ఫొటో తీశాడు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో పెట్టాడు. షూటింగ్ లో ఇలా పడుకోవడానికి పెట్టి పుట్టాలి అనే అర్థం వచ్చేలా సెటైరిక్ గా ఓ కామెడీ పోస్ట్ కూడా పెట్టాడు.

దీనిపై తాజాగా కీర్తిసురేష్ స్పందించింది. ఆ ఫొటోను ట్యాగ్ చేసిన కీర్తిసురేష్.. షాట్ గ్యాప్ లో పడుకోకూడదనే విషయాన్ని నేర్చుకున్నానని తెలిపింది. అక్కడితో ఆగకుండా.. తనను ఆటపట్టించిన నితిన్ పై త్వరలోనే పగ తీర్చుకుంటానని ఓపెన్ గా ఛాలెంజ్ చేసింది.

ఇలా రంగ్ దే షూటింగ్ సరదాగా సాగిపోతోంది. దుబాయ్ షెడ్యూల్ తో ఈ సినిమా పూర్తవుతుంది. సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. జీ స్టుడియోస్ సంస్థ ఈ సినిమా పూర్తి హక్కులు దక్కించుకున్నట్టు టాక్.