రెండు వర్గాలుగా చీలిన మహేష్ ఫ్యాన్స్

ఫ్యాన్స్ అంటే ఎప్పుడూ కలిసే ఉంటారు. తమ అభిమాన హీరోపై ఈగ కూడా వాలనీయరు. కానీ ఈసారి మాత్రం ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకర్నొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ వింత పరిస్థితి మహేష్ ఫ్యాన్స్ గ్రూపుల మధ్య ఏర్పడింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. మహేష్ నటించిన సైనికుడు సినిమా సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు విడుదలైంది. దీంతో కొంతమంది మహేష్ అభిమానులు #14ఇయర్స్ సైనికుడు అంటూ ట్రెండింగ్ షురూ చేశారు.

నిజానికి ఇదొక ఫ్లాప్ సినిమా. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అట్టర్ ఫ్లాప్ సినిమా. ఇలాంటి సినిమాను ట్రెండ్ చేయొద్దంటూ మరో మహేష్ ఫ్యాన్స్ గ్రూప్ ప్రచారం అందుకుంది. దీంతో మహేష్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం సైనికుడిపై ప్రచారం స్టార్ట్ చేస్తే.. మరో వర్గం దాన్ని మరిపించేలా మహేష్ కొత్త ఫొటోలతో ట్రెండింగ్ మొదలుపెట్టింది.