ప్రభాస్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ

మరో పాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పాడు ప్రభాస్. అది కూడా అలాంటిలాంటి దర్శకుడితో కాదు. దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కేజీఎఫ్ సినిమాను తీసిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మూవీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని కేజీఎఫ్ నిర్మాతలు పరోక్షంగా వెల్లడించారు.

ప్రస్తుతం కేజీఎఫ్-2 సినిమాను తెరకెక్కిస్తున్న హోబలే ఫిలిమ్స్ సంస్థ, తమ నెక్ట్స్ ప్రాజెక్టు కూడా పాన్ ఇండియన్ సినిమానే అని ప్రకటించింది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని కూడా ఎనౌన్స్ చేసింది. అయితే అది ప్రభాస్-ప్రశాంత్ నీల్ సినిమానే అనేది ఓపెన్ సీక్రెట్.

కొన్నాళ్లుగా ప్రభాస్ తో చర్చలు జరుపుతున్నాడు ప్రశాంత్ నీల్. ఒక దశలో ప్రభాస్ నో చెప్పాడని, ఆ టైమ్ లో మహేష్ వైపు వెళ్లాడని కూడా వార్తలొచ్చాయి. కానీ ప్రభాస్-ప్రశాంత్ మూవీ లాక్ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రకటన వస్తుంది.

ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. దీని తర్వాత ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలున్నాయి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా వస్తుంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడు ప్రశాంత్ నీల్.