ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చిన హీరో

ఆరోగ్య సమస్యలు ఓవైపు.. రెండేళ్లుగా నలిగిన ప్రాజెక్టు (అరణ్య) మరోవైపు.. మధ్యలో లాక్ డౌన్.. ఇలా అన్నీ కలిసి రానా కెరీర్ కు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చేశాయి. అయితే ఈ బ్రేక్ ను కూడా తన లవ్ లైఫ్ కోసం వాడుకున్నాడు రానా. ఎంచక్కా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలా లైఫ్ లో సెట్ అవ్వడంతో పాటు.. హెల్త్ పరంగా కూడా కోలుకున్న రానా.. ఎట్టకేలకు తన సినిమా స్టార్ట్ చేశాడు.

చాన్నాళ్లుగా సాగుతున్న విరాటపర్వం సినిమా షూటింగ్ ను రానా మొదలుపెట్టాడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. అయితే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించాడు రానా.

విరాటపర్వం షూట్ కంప్లీట్ చేసి, మళ్లీ గ్యాప్ తీసుకొని, అప్పుడు కొత్త సినిమా చేయాలనుకుంటున్నాడు. అయితే అంతా ఊహించినట్టు విరాటపర్వం తర్వాత హిరణ్యకశిప ప్రాజెక్టు మాత్రం సెట్స్ పైకి రావడం లేదు. ఆ సినిమాను 2022లో స్టార్ట్ చేస్తాడు. ఈ గ్యాప్ లో రానా ఏ సినిమా ఓకే చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.