సిటీలో ల్యాండ్ అయిన సమంత

కొన్ని రోజులుగా మాల్దీవుల్లో సందడి చేసిన సమంత, హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. భర్త నాగచైతన్యతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సమంత దిగిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. పైన ఓ కోటు, కింద ఓ చిన్న నిక్కర్ వేసుకున్న సమంత ఫొటోలు అందర్నీ ఇచ్చే ఆకర్షించాయి.

లాక్ డౌన్ లో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయింది సమంత. అన్నీ సెట్ అయిన తర్వాత తప్పకుండా టూర్ కు వెళ్తానని 2-3 సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అటు భర్త నాగచైతన్య కూడా లవ్ స్టోరీ సినిమాను పూర్తిచేయడంతో.. ఇద్దరూ కలిసి మాల్దీవులు వెళ్లారు. వారం రోజుల పాటు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.

నిజానికి వీళ్లిద్దరి ఫేవరెట్ స్పాట్ గోవా. గ్యాప్ లో అక్కడికే వెళ్దాం అనుకున్నారు. కానీ ఈ కరోనా పరిస్థితుల్లో గోవా కంటే మాల్దీవులు అన్ని విధాలుగా సేఫ్. అందుకే శామ్-చైతూ జోడీ అక్కడ ల్యాండ్ అయింది. ఎఁజాయ్ చేసి హైదరాబాద్ తిరిగొచ్చింది.