పోలవరంలో చంద్రన్న భజనల ఖర్చు 83.45 కోట్లు

పోలవరం ప్రాజెక్ట్ పేరుతో చంద్రబాబు చేసిన వృథా ఖర్చు వ్యవహారాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు సీఎం జగన్. సోమవారం పోలవారం పేరుతో ప్రాజెక్ట్ పనితీరు మదింపు చేయడానికి వెళ్లేవారని, అది కూడా ప్రచారంలో భాగమేనని ఎద్దేవా చేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ వద్దకు ప్రజల సందర్శన అనేది పూర్తిగా వృథా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తేల్చి చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్ వద్దకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు వేసి మరీ చంద్రబాబు అతి చేశారని విమర్శించారు. తీరా అక్కడికి జనాలను తీసుకెళ్లి ఏంచేశారో తెలుసా అంటూ.. పోలవరం ప్రాజెక్ట్ వద్ద జరిగిన భజన కాలక్షేపం వీడియో ప్లే చేసి చూపించారు. ఆ భజన చూసిన వైసీపీ సభ్యులు పడీ పడీ నవ్వారు. చివరకు స్పీకర్ తమ్మినేని కూడా పోలవరం వద్ద ఇలాంటి ఘోరాలు, నేరాలు జరిగాయా అని నోరెళ్లబెట్టారు. ఓ దశలో టీడీపీ సభ్యులు కూడా చంద్రబాబు పేరుతో మహిళలు చేసిన భజనను చూసి నవ్వుకున్నారు. ఈ భజన కాలక్షేపానికి చంద్రబాబు 83కోట్ల 45లక్షల రూపాయలు పెట్టారని వివరించారు.

వైసీపీ హయాంలో పోలవరం ప్రచారానికి వృథాగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని స్పష్టం చేశారు సీఎం జగన్.

మొత్తమ్మీద పోలవరం వ్యవహారంలో చంద్రబాబు భజన కాలక్షేపం అసెంబ్లీలో నవ్వులు పూయించింది.