Telugu Global
Cinema & Entertainment

ఎఫ్3 షెడ్యూల్ ఫిక్స్ అయింది

ఈ లాక్ డౌన్ టైమ్ ను పక్కాగా ఉపయోగించుకున్న దర్శకుల్లో అనీల్ రావిపూడి ఒకడు. ఓ చిన్న సినిమాకు స్క్రీన్ ప్లే అందించే పని చేయడంతో పాటు.. తన ప్రతిష్టాత్మక సినిమా ఎఫ్3ని స్క్రీన్ ప్లేతో పాటు పూర్తిచేశాడు ఈ దర్శకుడు. ఈనెల 14 నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి మొన్నటివరకు చాలా పుకార్లు షికార్లు చేశాయి. వెంకటేష్, వరుణ్ తేజ్ ఎక్స్ ట్రా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని.. వరుణ్ అయితే […]

ఎఫ్3 షెడ్యూల్ ఫిక్స్ అయింది
X

ఈ లాక్ డౌన్ టైమ్ ను పక్కాగా ఉపయోగించుకున్న దర్శకుల్లో అనీల్ రావిపూడి ఒకడు. ఓ చిన్న సినిమాకు స్క్రీన్ ప్లే అందించే పని చేయడంతో పాటు.. తన ప్రతిష్టాత్మక సినిమా ఎఫ్3ని స్క్రీన్ ప్లేతో పాటు పూర్తిచేశాడు ఈ దర్శకుడు. ఈనెల 14 నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.

ఈ సినిమాకు సంబంధించి మొన్నటివరకు చాలా పుకార్లు షికార్లు చేశాయి. వెంకటేష్, వరుణ్ తేజ్ ఎక్స్ ట్రా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని.. వరుణ్ అయితే ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేశాడంటూ కథనాలు వచ్చాయి. వీటన్నింటినీ దిల్ రాజు క్లియర్ చేసి.. హీరోలిద్దరి దగ్గర్నుంచి కాల్షీట్లు సంపాదించాడు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు వెంకటేష్ నారప్ప సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాడు. మరో వారం రోజుల్లో ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిపోతాయి. ఆ వెంటనే అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఎఫ్3 మొదలవుతుంది.

First Published:  1 Dec 2020 8:30 PM GMT
Next Story