విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మోసగాళ్లు’. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఇది విడుదలవుతోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ‘మోసగాళ్లు’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు విష్ణు మంచు. ఈ ప్రాజెక్టును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.
లేటెస్ట్‌గా నవీన్ చంద్ర బర్త్‌డేని పురస్కరించుకొని ఆయనకు విషెస్ తెలియజేస్తూ, సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. ‘మోసగాళ్లు’ మూవీలో సిద్ అనే పాత్రను నవీన్ చంద్ర చేస్తున్నాడు. ఇంటెన్స్ లుక్స్‌తో, మాస్ అప్పీల్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన కనిపిస్తున్నాడు. ఇంతకుమించి అతడి పాత్ర ఏంటనేది బయటపెట్టలేదు.
చరిత్రలో నమోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తయారవుతున్న ‘మోసగాళ్లు’ మూవీకి లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు చెల్లెలిగా కాజల్ అగర్వాల్, ఆయన జోడీగా రుహీ సింగ్ నటిస్తున్నారు.
Team #Mosagallu wishing the most talented actor @Naveenc212 A very happy birthday. pic.twitter.com/GjakEqTQpu
— BARaju (@baraju_SuperHit) December 2, 2020