మరో సెబాస్టియన్ వచ్చాడు

కిరణ్‌ అబ్బవరం హీరోగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. మదనపల్లిలోని సొసైటీ కాలనీ రామాలయం కల్యాణ మండపంలో బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దేవుని చిత్రపటాలపై తొలి షాట్ తీశారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతోంది సెబాస్టియన్ మూవీ. రేచీకటి కాన్సెప్ట్ తో ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు బాలాజీ. ఇందులో నమ్రతా దరేకర్‌, కోమలీ ప్రసాద్‌ హీరోయిన్లుగా నటించబోతున్నారు.. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను షూటింగ్‌ పూర్తిచేసి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రాజావారు రాణిగారు సినిమాతో పేరుతెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. తన రెండో సినిమాగా ఎస్ఆర్ కల్యాణమండపం అనే సినిమా చేస్తున్నాడు. హీరోగా అతడికి సెబాస్టియన్ మూడో సినిమా.