Telugu Global
National

జానా కొడుకుపై బీజేపీ ఆశలు.... మరీ ఆ చాన్స్‌ ఇస్తారా?

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. జీహెచ్ఎంసీ తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీల ఫోకస్‌ నాగార్జున సాగర్‌పై పడింది. ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సరిగ్గా ఎండాకాలంలో ఎన్నికలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే పోటీపై ఇప్పుటినుంచే వేట మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్‌ గెలిచింది. జానారెడ్డిపై నోముల నర్సింహ్మయ్య 7 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. […]

జానా కొడుకుపై బీజేపీ ఆశలు.... మరీ ఆ చాన్స్‌ ఇస్తారా?
X

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. జీహెచ్ఎంసీ తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీల ఫోకస్‌ నాగార్జున సాగర్‌పై పడింది. ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సరిగ్గా ఎండాకాలంలో ఎన్నికలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే పోటీపై ఇప్పుటినుంచే వేట మొదలైంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్‌ గెలిచింది. జానారెడ్డిపై నోముల నర్సింహ్మయ్య 7 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితాకు కేవలం 2675 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఒక శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చినా…. పార్టీ ఇప్పుడు ఎలా పోటీ ఇస్తుంది అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీకి ఇప్పుడు నాగార్జునసాగర్‌ రూపంలో అసలు పరీక్ష మొదలైంది.

నాగార్జునసాగర్‌ కాంగ్రెస్‌కు మంచి పట్టున్న నియోజకవర్గం. జానారెడ్డి వరుసగా గెలిచిన సీటు. ఇక్కడ రెడ్డి, యాదవ సామాజికవర్గమే కీలకం. దీంతో ఇక్కడ రెడ్డి లేదా యాదవ సామాజికవర్గం నేతలే గెలుస్తున్నారు. ఇప్పటివరకూ జానారెడ్డిపై రాంమూర్తి యాదవ్, నోముల నర్సింహ్మయ్య గెలుపొందారు. దీంతో ఇప్పుడు ఈ సామాజికవర్గ నేతలనే నిలబెట్టాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న బీజేపీ జానారెడ్డి కుటుంబంపై ఫోకస్‌ పెట్టింది.

జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే డీకే అరుణ… రఘువీర్ తో చర్చలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఉప ఎన్నికకు టైమ్‌ ఉందని….ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోలేనని అన్నట్లు సమాచారం.

జానారెడ్డి కాంగ్రెస్‌ వాది. ఆయన బీజేపీ వైపు ఎందుకు వెళతారనేది కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రశ్న.

మొత్తానికి గ్రేటర్‌ ఎన్నికలతో బీజేపీకి హైప్‌ వచ్చింది. ఈ హైప్‌ కంటిన్యూ కావాలంటే నాగార్జునసాగర్‌లో సత్తా చాటాల్సిన అవసరం బీజేపీకి వచ్చింది. దుబ్బాకలో గెలిచిన బీజేపీకి ఇప్పుడు అసలు సిసలైన పరీక్ష ఎదురుకాబోతుంది.

First Published:  2 Dec 2020 8:42 PM GMT
Next Story