Telugu Global
National

అసెంబ్లీలో ఫేక్ గోల...

అసెంబ్లీ బయట సీఎం జగన్ ని ఫేక్ సీఎంగా అభివర్ణిస్తూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. 151మంది ఎమ్మెల్యేల బలం ఉన్న జగన్ ఫేక్ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు? ఆ మాటకొస్తే పార్టీని దొడ్డిదారిన చేజిక్కించుకుని, మామ పీఠాన్ని లాగేసుకుని, వెన్నుపోటు రాజకీయాలతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబే ఫేక్ సీఎం అని అన్నారు నాని. ఆయన ఫేక్ సీఎం, ఫేక్ ప్రతిపక్ష నాయకుడు అసలు టీడీపీయే పెద్ద […]

అసెంబ్లీలో ఫేక్ గోల...
X

అసెంబ్లీ బయట సీఎం జగన్ ని ఫేక్ సీఎంగా అభివర్ణిస్తూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. 151మంది ఎమ్మెల్యేల బలం ఉన్న జగన్ ఫేక్ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు? ఆ మాటకొస్తే పార్టీని దొడ్డిదారిన చేజిక్కించుకుని, మామ పీఠాన్ని లాగేసుకుని, వెన్నుపోటు రాజకీయాలతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబే ఫేక్ సీఎం అని అన్నారు నాని.

ఆయన ఫేక్ సీఎం, ఫేక్ ప్రతిపక్ష నాయకుడు అసలు టీడీపీయే పెద్ద ఫేక్ పార్టీ అని ధ్వజమెత్తారు.

పారిపోయిన ఘన చరిత్ర బాబుదే…

పింఛన్ల పంపిణీ సందర్భంగా చర్చ మొదలు పెట్టిన కొడాలి నాని.. చివరకు చంద్రబాబుపై విమర్శలతో దాన్ని ముగించారు. రాష్ట్ర రాజకీయాల్లో పారిపోయిన చరిత్ర చంద్రబాబు పేరిటే ఉందని, దాన్ని ఎవరూ తిరగరాయలేరన్నారు.

“1983లో ఓడిపోగానే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పారిపోయారు.
ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయారు.
ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి కాలవ గట్టుకి పారిపోయారు.
కరోనా రాగానే కాలవగట్టునుంచి హైదరాబాద్ లోని అద్దాల మేడలోకి పారిపోయారు.
స్కాముల్లో పారిపోయి 18 స్టేలు తెచ్చుకున్నారు.
ఆల్మట్టి డ్యామ్ నుంచి పారిపోయారు.. “ అని అన్నారు నాని.

ప్రధాని మోదీకి తెలుగు రాదని సందులు, గొందుల్లో తిట్టిన చంద్రబాబు చివరకు ఆయనకు విషయం తెలిసే సరికి ఢిల్లీ వెళ్లడం మానేశారని, చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

అందితే కాళ్లు, అందకపోతే జుట్టు, అదీ లేకపోతే వెన్నుపోటు పొడిచే నాయకుడు చంద్రబాబు అని అన్నారు నాని. అలాంటి చంద్రబాబు ప్రజాబలం ఉన్న జగన్ ని ఫేక్ సీఎంగా అభివర్ణించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

అసెంబ్లీలో నాలుగోరోజు జరిగిన చర్చలో కొడాలి నాని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

First Published:  3 Dec 2020 7:37 AM GMT
Next Story