సోషల్ మీడియాలో పవన్ పారితోషికం

vakeel saab movie pawan-kalyan-plan-change

హీరోలు తమ సినిమాలకు ఎంత తీసుకుంటారనేది టాప్ సీక్రెట్. ఏ హీరో తన రెమ్యూరనేషన్ ను బయటపెట్టడు. ఇండస్ట్రీలో ఉండాలనుకునే ఏ నిర్మాత ఆ హీరో రేటును బయటపెట్టడు. అయితే బయటకు మాత్రం కొన్ని నంబర్లు అలా వస్తుంటాయి. అవి పేరుకు పుకార్లే అయినప్పటికీ, అందులో 90 శాతం వాస్తవం ఉంటుంది. ఇప్పుడు పవన్ పారితోషికం విషయంలో కూడా అలాంటి పుకార్లే మొదలయ్యాయి.

వకీల్ సాబ్ రెమ్యూనరేషన్స్ అంటూ ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో దాదాపు కీలకమైన పారితోషికాలు అన్నీ ఉన్నాయి. అయితే అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది మాత్రం పవన్ పారితోషికం. తన రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కోసం పవన్ ఏకంగా 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడనేది సోషల్ మీడియా సందేశాల సారాంశం.

ముందుగా 25 కోట్లు అందుకున్నాడట. డబ్బింగ్ స్టేజ్ లో మిగతా ఎమౌంట్ అందుకుంటాడట. నిజంగా ఈ న్యూస్ నిజమైతే.. సౌత్ లో అత్యథిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా పవన్ చరిత్ర సృష్టించినట్టే.

ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ కు, ప్రభాస్ అభిమానులకు మధ్య చిన్నపాటి
వాగ్వాదం నడుస్తున్నప్పటికీ మేటర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇక సదరు స్క్రీన్ షాట్ లో విషయాలు చూస్తే.. పవన్ తర్వాత అత్యథిక పారితోషికం
అందుకుంటున్న వ్యక్తి తమన్. వకీల్ సాబ్ కోసం తమన్ కు కోటి రూపాయలు ఇచ్చారట. ఇక నివేత థామస్ కు 75 లక్షలు, శృతిహాసన్ కు 50 లక్షలు (చిన్న పాత్ర కాబట్టి) ముట్టినట్టు ఆ సందేశంలో ఉంది. ఓవరాల్ గా వకీల్ సాబ్ బడ్జెట్ 90 కోట్ల రూపాయలట.