Telugu Global
National

పింఛను పెంచి తీరతాం... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన

పాదయాత్రలో ఏం హామీలు ఇచ్చామో? మ్యానిఫెస్టోలో ఏం పెట్టామో ఆ అంశాలను తప్పకుండా అమలు చేస్తామని సీఎం జగన్​మోహన్​రెడ్డి స్పష్టం చేశారు. పింఛను పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చామని.. అందులో భాగంగానే రూ. 2000 ఉన్న పింఛనును రూ.2250కి పెంచామని… ఇలా దశల వారీగా రూ. 3000 వరకు పెంచుతామని స్పష్టం చేశారు. జూలై 8 న దివంగత నేత వైఎస్సార్ జయంతి రోజున మరో రూ.250 పెంచి మొత్తం రూ.2,500 చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో […]

పింఛను పెంచి తీరతాం... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన
X

పాదయాత్రలో ఏం హామీలు ఇచ్చామో? మ్యానిఫెస్టోలో ఏం పెట్టామో ఆ అంశాలను తప్పకుండా అమలు చేస్తామని సీఎం జగన్​మోహన్​రెడ్డి స్పష్టం చేశారు. పింఛను పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చామని.. అందులో భాగంగానే రూ. 2000 ఉన్న పింఛనును రూ.2250కి పెంచామని… ఇలా దశల వారీగా రూ. 3000 వరకు పెంచుతామని స్పష్టం చేశారు. జూలై 8 న దివంగత నేత వైఎస్సార్ జయంతి రోజున మరో రూ.250 పెంచి మొత్తం రూ.2,500 చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. టీడీపీ హయాంలో కేవలం 44 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చారని, తాము 61 లక్షలమందికి ఇస్తున్నామని వివరించారు.

ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పింఛన్ల విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీ పింఛన్ల పంపిణీపై మాట తప్పిందని.. రూ. 3000 ఇస్తామని చెప్పి కేవలం రూ. 2,250కి మాత్రమే పెంచిందని ఆరోపించారు. దీనిపై సభలో వాదనలు, ప్రతి వాదనలు జరిగాయి.

రామానాయుడు మాటలపై మంత్రి కొడాలి నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక తొలుత కేవలం రూ. 1000 మాత్రమే పింఛను ఇచ్చేవారని, అది కూడా చాలా తక్కువ మందికి ఇచ్చేవారని గుర్తుచేశారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్​ నవరత్నాలు ప్రకటించిన అనంతరం చంద్రబాబు పింఛను సొమ్ము రూ. 2000లకు పెంచారని గుర్తుచేశారు. సీఎం జగన్ మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా దశల వారీగా పింఛను పెంచుకుంటూ పోతున్నట్లు చెప్పారు.

ఈ విషయంపై సీఎం జగన్​మోహన్​రెడ్డి స్పందిస్తూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆయనపై ప్రివిలేజ్​ మోషన్​ పెట్టాలని.. రామానాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తమది మాటతప్పే ప్రభుత్వం కాదని.. మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అదే చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛను సొమ్ము పెంచబోతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు.

ప్రస్తుతం రూ. 2,250 చెల్లించే పింఛను మొత్తం క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్లి రూ.3000 చేస్తామన్నారు. వైఎస్సార్ జయంతి రోజున మరో రూ.250 పెంచి పింఛను మొత్తం రూ.2,500 చేస్తామన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధుల పింఛన్ వయసును 65 నుంచి 60కు తగ్గించినట్లు గుర్తు చేశారు.

First Published:  3 Dec 2020 6:17 AM GMT
Next Story