Telugu Global
National

శాసన మండలితో చిక్కు... ఇప్పట్లో తప్పదా..!

ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. సొంతంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. టీడీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి దూరమైన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకే మద్దతిస్తున్నారు. జనసేన పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే గెలిచిన కొద్దిరోజుల నుంచే ప్రభుత్వ నిర్ణయాలకు జై కొడుతున్నారు. కానీ శాసనమండలిలో మాత్రం వైసీపీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో కీలక బిల్లులు ఆమోదించుకొనే విషయంలో ప్రభుత్వానికి చికాకులు తప్పడం లేదు. వైసీపీ 151 స్థానాలు గెలుచుకొని శాసనసభలోకి సగర్వంగా […]

శాసన మండలితో చిక్కు... ఇప్పట్లో తప్పదా..!
X

ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. సొంతంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. టీడీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి దూరమైన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకే మద్దతిస్తున్నారు. జనసేన పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే గెలిచిన కొద్దిరోజుల నుంచే ప్రభుత్వ నిర్ణయాలకు జై కొడుతున్నారు. కానీ శాసనమండలిలో మాత్రం వైసీపీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో కీలక బిల్లులు ఆమోదించుకొనే విషయంలో ప్రభుత్వానికి చికాకులు తప్పడం లేదు.

వైసీపీ 151 స్థానాలు గెలుచుకొని శాసనసభలోకి సగర్వంగా అడుగుపెట్టింది. కానీ మండలిలో మాత్రం ఆధిక్యం లేదు. దీంతో కీలకబిల్లులకు మండలిలో బ్రేక్​ పడుతోంది. టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుకుంటోందని అధికార పక్షం ఆరోపిస్తోంది.

శాసనమండలిలో 58 మంది సభ్యులకు గాను వైసీపీకి 11 మంది సభ్యులు ఉండగా, ప్రతిపక్ష టీడీపీకి ఏకంగా 30 మంది సభ్యులు ఉన్నారు. మిగతా స్థానాలు ఇతరులకు ఉన్నాయి.

అయితే మండలి చైర్మన్​ షరీఫ్ కూడా టీడీపీకి చెందిన నాయకుడే. దీంతో కీలకబిల్లులు మండలిలో ఆమోదానికి నోచుకోవడం లేదు. కొద్ది నెలల కిందట మూడురాజధానుల బిల్లును మండలి చైర్మన్​ సెలక్ట్​కమిటీకి పంపారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. అలాగే ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ కమిషన్, విభజన బిల్లులను మండలి అడ్డుకుంది.

తాజాగా శాసనమండలిలో ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఒకేరోజు మూడు బిల్లులను మండలి తిరస్కరించింది. పెట్రోల్, డీజిల్ పై రోడ్డు అభివృద్ధి పన్ను విధింపు బిల్లు, వృత్తులు, వ్యాపారాల, ఉద్యోగుల పై పన్ను పెంపు, పట్టణ ప్రాంతాల్లో ఆస్తి విలువపై పన్ను విధింపు బిల్లులు మండలిలో వీగిపోయాయి. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, పశువుల మేత బిల్లు, భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించే బిల్లులకు మాత్రమే ఆమోదం లభించింది.

మండలి నిర్ణయాలతో సీఎం జగన్​ తీవ్ర అసహనంగా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను శాసనమండలి అడ్డుకుంటోందని, అసలు ఆ వ్యవస్థను రద్దు చేయాలని కొన్ని నెలల కిందట అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. అయితే ప్రస్తుతం మండలి రద్దు పట్ల ప్రభుత్వం అంత సుముఖంగా లేన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జూన్​ కల్లా మండలిలో వైసీపీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పటివరకు వేచి చూడాలని సీఎం జగన్​ యోచిస్తున్నారట.

దానికి తోడు గతంలో అనేకమంది వైసీపీ నేతలకు .. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో హామీలు ఇచ్చి ఉండటంతో జగన్​ మండలి విషయంలో వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు. అప్పటివరకు ప్రభుత్వానికి మండలి చికాకులు తప్పేలా కనిపించడం లేదు.

First Published:  4 Dec 2020 1:34 AM GMT
Next Story