Telugu Global
National

అటు అసెంబ్లీ సమావేశాలు... ఇటు బాబు మీడియా సమావేశాలు...

అసెంబ్లీలోకి మూడు ఛానెళ్లను రానివ్వడంలేదు, మమ్మల్ని సరిగా ఫోకస్ కానివ్వడంలేదంటూ సమావేశాల తొలిరోజే ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్షనేత చంద్రబాబు. అదే సమయంలో అసెంబ్లీ అధికార పక్షనేతల దాడి తీవ్రస్థాయిలో ఉండటంతో.. మధ్యలోనే చంద్రబాబు సహా టీడీపీ నేతలు బైటకొచ్చేస్తున్నారు. అసెంబ్లీ జరుగుతుండగానే.. బైట మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ అనుకూల ఛానెళ్లలో లైవ్ ఇచ్చేసుకుంటున్నారు. ఇలా సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు బాబు. పోనీ అసెంబ్లీలో సస్పెన్షన్ వేటు పడితే అదో లెక్క. సస్పెండ్ కాని […]

అటు అసెంబ్లీ సమావేశాలు... ఇటు బాబు మీడియా సమావేశాలు...
X

అసెంబ్లీలోకి మూడు ఛానెళ్లను రానివ్వడంలేదు, మమ్మల్ని సరిగా ఫోకస్ కానివ్వడంలేదంటూ సమావేశాల తొలిరోజే ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్షనేత చంద్రబాబు. అదే సమయంలో అసెంబ్లీ అధికార పక్షనేతల దాడి తీవ్రస్థాయిలో ఉండటంతో.. మధ్యలోనే చంద్రబాబు సహా టీడీపీ నేతలు బైటకొచ్చేస్తున్నారు. అసెంబ్లీ జరుగుతుండగానే.. బైట మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ అనుకూల ఛానెళ్లలో లైవ్ ఇచ్చేసుకుంటున్నారు. ఇలా సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు బాబు.

పోనీ అసెంబ్లీలో సస్పెన్షన్ వేటు పడితే అదో లెక్క. సస్పెండ్ కాని రోజుల్లో కూడా, అసెంబ్లీ జరుగుతుండగానే బైటకు రావడం, వెంటనే మీడియా సమావేశం పెట్టి అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారాలపై వ్యాఖ్యానించడం చూస్తుంటే.. చంద్రబాబు మీడియా అటెన్షన్ ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతోంది.

గత సమావేశాల సమయంలో కూడా బాబు ఇదే పద్ధతిని అవలంభించారు. ఈ దఫా దాన్ని మరింత బలంగా కొనసాగిస్తున్నారు. సమావేశాల మధ్యలోనే బైటకొచ్చేసి, తమ నాయకులందరితో కలసి మీడియాలో కనిపిస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు బలం తగ్గిపోవడం, సమస్యలంటూ తాము ప్రస్తావిస్తున్న అంశాలకు సవివరంగా అధికార పక్షం సమాధానాలివ్వడంతో టీడీపీ నేతలకు ప్రత్యామ్నాయం కనిపించడంలేదు.

తొలిరోజే దూకుడు ప్రదర్శించిన చంద్రబాబు ఆ తర్వాత వైసీపీ నేతల ఎదురుదాడి ఎక్కువ కావడంతో సభకు కేటాయించే సమయాన్ని తగ్గించేశారు. సమావేశాల ముందు ఉదయం నిరసన కార్యక్రమం, సమావేశాలు పూర్తి కాకుండానే సాయంత్రం మీడియా సమావేశం.. ఈ షెడ్యూల్ కి ఫిక్స్ అయ్యారు బాబు.

సభాసంప్రదాయాల గురించి గొప్పగా చెప్పే చంద్రబాబే అసెంబ్లీ సమావేశం పూర్తి కాకుండానే బైటకు రావడం, సభ జరుగుతుండగానే మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

సభలో సమాధానం చెప్పలేకే టీడీపీ నేతలు పారిపోతున్నారంటూ వైసీపీ ఎద్దేవా చేస్తుంటే.. అసెంబ్లీలో తమ గొంతు నొక్కేస్తున్నారని, అందుకే త్వరగా బైటపడుతున్నామని టీడీపీ వాదిస్తోంది.

First Published:  3 Dec 2020 9:52 PM GMT
Next Story