ఖల్ నాయక్ మళ్లీ వస్తున్నాడు

2 దశాబ్దాల కిందటొచ్చిన ఖల్ నాయక్ సినిమా ఇండియాను ఓ ఊపుఊపిన విషయం తెలిసిందే. సంజయ్ దత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది ఆ మూవీ. ఇప్పుటికీ ఖల్ నాయక్ పేరు చెబితే అందులో సూపర్ హిట్ సాంగ్స్, మాధురీదీక్షిత్ నటన గుర్తొస్తాయి. మళ్లీ ఇన్నాళ్లకు తెరపైకొచ్చింది ఖల్ నాయక్.

రెండున్నర దశాబ్దాల కిందటి ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనుకుంటున్నాడు దర్శకనిర్మాత సుభాష్ ఘయ్. ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చేలా ఉంది. ఖల్ నాయక్ సీక్వెల్ లో నటించేందుకు సంజయ్ దత్ ఒప్పుకున్నాడు. కేజీఎఫ్-2 కంప్లీట్ అయిన వెంటనే ఇది సెట్స్ పైకి వస్తుంది.

ఇక సీక్వెల్ లో మార్పుల విషయానికొస్తే.. ఒరిజినల్ వెర్షన్ లో హీరోయిన్ గా నటించిన మాధురీ దీక్షిత్.. సీక్వెల్ లో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఒరిజినల్ లో పోలీసాఫీసర్ గా నటించిన జాకీష్రాఫ్ స్థానంలో అతడి కొడుకు టైగర్ ష్రాఫ్ కనిపించబోతున్నాడు. ఈసారి ఏఆర్ రెహ్మాన్ ను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు.