Telugu Global
International

ప్రపంచం గుర్తించింది... ప్రపంచం గర్వించే పని చేశాడు...

ప్రపంచ వ్యాప్తంగా 12వేలమంది ఉపాధ్యాయులు పాల్గొన్న ఓ పోటీలో.. అతను నెంబర్1 గా నిలిచాడు. వరల్డ్ మోస్ట్ ఎక్సెప్షనల్ టీచర్ అనే అవార్డు అందుకోవడమే అత్యంత గొప్ప విషయం అయితే, 10లక్షల డాలర్ల ప్రైజ్ మనీని మిగతా వారితో కలసి పంచుకోవడం అంతకంటే గొప్ప విషయం. లండన్ కు చెందిన వార్కే ఫౌండేషన్ ప్రతి ఏటా అందించే ఈ అవార్డుని ఈ ఏడాది షోలాపూర్ కి చెందిన రంజిత్ సిన్హ్ దిశాలే అందుకున్నారు. ఈ ఏడాది ప్రపంచ […]

ప్రపంచం గుర్తించింది... ప్రపంచం గర్వించే పని చేశాడు...
X

ప్రపంచ వ్యాప్తంగా 12వేలమంది ఉపాధ్యాయులు పాల్గొన్న ఓ పోటీలో.. అతను నెంబర్1 గా నిలిచాడు. వరల్డ్ మోస్ట్ ఎక్సెప్షనల్ టీచర్ అనే అవార్డు అందుకోవడమే అత్యంత గొప్ప విషయం అయితే, 10లక్షల డాలర్ల ప్రైజ్ మనీని మిగతా వారితో కలసి పంచుకోవడం అంతకంటే గొప్ప విషయం.

లండన్ కు చెందిన వార్కే ఫౌండేషన్ ప్రతి ఏటా అందించే ఈ అవార్డుని ఈ ఏడాది షోలాపూర్ కి చెందిన రంజిత్ సిన్హ్ దిశాలే అందుకున్నారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పోటీపడిన 12 వేలమందిలో రంజిత్ మొదటి స్థానంలో నిలిచాడు. ప్రైజ్ మనీగా వచ్చిన 10లక్షల డాలర్లలో సగాన్ని అంటే 5లక్షల డాలర్ల సొమ్ముని రెండో స్థానంలో నిలిచిన 9మందికి ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఎవరీ రంజిత్..?

షోలాపూర్ జిల్లా పరిటేవాడి కి చెందిన రంజిత్ సిన్హ్ దిశాలే ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే ఆపేశాడు. అనుకోకుండా అదే ఊరిలో పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఓ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా కుదిరాడు. 1నుంచి 4 తరగతులు ఉన్న ఆ స్కూల్ లో 110మంది విద్యార్థులకు కేవలం ఐదుగురు టీచర్లు మాత్రమే. 11ఏళ్లక్రితం స్కూల్ టీచర్ గా కెరీర్ ప్రారంభించిన రంజిత్.. ఎవరూ ఊహించని అద్భుతాలు చేశారు.

ఎందుకీ అవార్డు..?

బాలికల విద్యపై ప్రచారం చేయడంతోపాటు, పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్ ముద్రించి వాటిని డిజిటల్ రూపంలో భద్రపరిచే విషయంలో రంజిత్ ఓ విప్లవాన్నే తీసుకొచ్చారు. క్యూఆర్ కోడ్ టెక్స్ట్ బుక్ రివల్యూషన్ కి మనదేశంలో ఆద్యుడు రంజిత్ అంటే అతిశయోక్తి కాదు.

పుస్తకాలలో ఉన్న సమాచారాన్నంతా స్థానిక విద్యార్థుల మాతృభాషలోకి అనువదించి వారికి ఆడియో రూపంలో అందుబాటులో ఉంచారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. పుస్తకాల్లోని సమాచారం ఆడియో, వీడియో రూపంలో అందుబాటులోకి వస్తుంది, పాఠాలకు సంబంధించిన అసైన్ మెంట్లు కూడా ప్రత్యక్షమవుతాయి.

ఈ క్యూఆర్ కోడ్ టెక్స్ట్ బుక్ రివల్యూషన్ తో రంజిత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అంతే కాదు, అంతర్జాతీయ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఆన్ లైన్ వేదికగా అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న రంజిత్.. తనని విజేతగా ప్రకటించడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రైజ్ మనీని సెకండ్ ప్లేస్ లో వచ్చినవారితో కలసి పంచుకుంటానని చెప్పారు.

ఉపాధ్యాయుల సృజనాత్మకత పెంచేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ కోసం తనకి వచ్చిన సొమ్ము వెచ్చిస్తానని అన్నారు. ఉపాధ్యాయులందరూ గొప్ప సృజనాత్మకత ఉన్నవారు. మార్పు కోసం తనతోపాటు అందరు టీచర్లకీ ఓ అవకాశం ఇస్తున్నా.. అందుకే ప్రైజ్ మనీని పంచేస్తున్నా అని గర్వంగా చెప్పారు రంజిత్.

First Published:  3 Dec 2020 11:39 PM GMT
Next Story