Telugu Global
National

అమరావతి రైతులకు మరోసారి చంద్రబాబు సినిమా...

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అమరావతికోసం రైతుల్ని రెచ్చగొట్టి రోడ్డుమీదకు తీసుకొచ్చారు చంద్రబాబు. అమరావతికి మాత్రమే జైకొడితే ఇతర ప్రాంతాల్లో రాజకీయంగా టీడీపీ సమాధి అవుతుందనే అనుమానం రాగానే ఉద్యమానికి దూరం జరిగారు బాబు. భార్య చేతి బంగారు గాజులు దానం చేసి, ఊరూవాడా జోలెపెట్టి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అమరావతిలో జరుగుతున్న నిరసన శిబిరంలోకి చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లూ మమ్మల్ని […]

అమరావతి రైతులకు మరోసారి చంద్రబాబు సినిమా...
X

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అమరావతికోసం రైతుల్ని రెచ్చగొట్టి రోడ్డుమీదకు తీసుకొచ్చారు చంద్రబాబు. అమరావతికి మాత్రమే జైకొడితే ఇతర ప్రాంతాల్లో రాజకీయంగా టీడీపీ సమాధి అవుతుందనే అనుమానం రాగానే ఉద్యమానికి దూరం జరిగారు బాబు. భార్య చేతి బంగారు గాజులు దానం చేసి, ఊరూవాడా జోలెపెట్టి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేశారు.

ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అమరావతిలో జరుగుతున్న నిరసన శిబిరంలోకి చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లూ మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు మా దగ్గరకు రాలేదు? అమరావతి గురించి కనీసం అసెంబ్లీలో కూడా ఎందుకు మాట్లాడలేదు..? అని వారిలో ఎవరైనా అడిగితే చంద్రబాబు దగ్గర సమాధానం లేదు. ఆ ప్రశ్నలేవీ రాకముందే మరో అద్భుతమైన సినిమా చూపెట్టడం మొదలు పెట్టారు బాబు.

“అమరావతి ఉద్యమం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఏడాదిపాటు ఉద్యమం చేసిన ఉద్యమ ధీరులు మీరే అవుతారు. భవిష్యత్తులో ఏ దేశంలో ఏ ఆందోళన మొదలైనా.. అమరావతినే స్ఫూర్తిగా తీసుకుంటారు” అంటూ అనునయ వాక్యాలు చెప్పారు.

అమరావతి పేరుతో జరుగుతున్న ఉద్యమంలో తనకు వ్యతిరేకత వస్తుందన్న ముందస్తు సమాచారంతోనే చంద్రబాబు సడన్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. ఉద్యమం మొదలు పెట్టిన తొలినాళ్లలో టీడీపీ సపోర్ట్ ఎలా ఉంది? ఏడాది పూర్తయ్యే దశలో ఎలా ఉంది? అనే విషయం ఇటీవలే అమరావతి రైతుల్లో చర్చకు వచ్చింది. కనీసం అసెంబ్లీలో కూడా చంద్రబాబు అమరావతి అనే అంశాన్ని మాట్లాడలేదని, కొందరు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ప్రతి రోజూ అసెంబ్లీకి వెళ్లే ముందు ఏదో ఒక సమస్యపై నిరసన తెలిపే చంద్రబాబుకి అమరావతి గోడు పట్టలేదా అని ఒకరిద్దరు తీవ్ర స్వరంతో మాట్లాడరట. చంద్రబాబులా మాయమాటలు చెప్పేవారికంటే.. అనుకూలమో, ప్రతికూలమో, అమరావతిపై స్థిర నిర్ణయంతో ఉన్న జగనే మేలు అనే దశకు వచ్చారట.

ఈ సమాచారం ఉప్పందడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు చంద్రబాబు. బుచ్చయ్య చౌదరిని వెంటబెట్టుకుని అమరావతి నిరసన శిబిరానికి చేరుకున్నారు. అమరావతి ఉద్యమానికి తాను దూరం కాలేదనే సంకేతాలు పంపారు.

First Published:  4 Dec 2020 8:22 PM GMT
Next Story