Telugu Global
National

కోటీ 60లక్షల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తాం...

కొవిడ్ వ్యాక్సిన్ మార్కెట్లోకి రాక మునుపే.. దాని పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ మరికొన్ని వారాల్లోనే అందుబాటులోకి వస్తుందని, తొలి దశలో వైద్య సిబ్బంది, వృద్ధులకు కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే సమయంలో ఇటు ఏపీ కూడా కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై కసరత్తులు మొదలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధతను సీఎం జగన్ అసెంబ్లీలో వివరించారు. తొలి దశలో ఏపీలో కోటీ 60లక్షలమందికి కొవిడ్ టీకా ఇవ్వబోతున్నారు. టీకా […]

కోటీ 60లక్షల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తాం...
X

కొవిడ్ వ్యాక్సిన్ మార్కెట్లోకి రాక మునుపే.. దాని పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ మరికొన్ని వారాల్లోనే అందుబాటులోకి వస్తుందని, తొలి దశలో వైద్య సిబ్బంది, వృద్ధులకు కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే సమయంలో ఇటు ఏపీ కూడా కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై కసరత్తులు మొదలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధతను సీఎం జగన్ అసెంబ్లీలో వివరించారు.

తొలి దశలో ఏపీలో కోటీ 60లక్షలమందికి కొవిడ్ టీకా ఇవ్వబోతున్నారు. టీకా నిల్వ, సరఫరాకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ కేంద్రం సంకేతాలు పంపిస్తున్న వేళ.. టీకా నిల్వ కోసం ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు సిద్ధం చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో 4,065 కోల్డ్‌ చైన్‌ పరికరాలు ఏర్పాటు చేశారు. కోల్డ్‌ బాక్సులు, సిరంజిలను కేంద్రం ఇస్తుండగా, రవాణా వాహనాలను కొనుగోలు చేసి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో ఆశా వర్కర్ల ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయబోతున్నారు. తొలి దశలో 3.60 లక్షలమంది వైద్య సిబ్బందికి, 7లక్షల మంది ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందికి, 50ఏళ్లు పైబడినవారికి (వీరి సంఖ్య సుమారు 90లక్షలు) టీకాలు ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం ఏపీలో సగటున రోజుకి 800 కొవిడ్ పాజిటివ్ కేసులు వస్తుండటంతో మరికొంతకాలం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు సీఎం జగన్.

అమెరికా ఎన్నికల వల్ల ఆ దేశంలో కొవిడ్ వ్యాప్తి పెరిగిందని, ఉత్తరాదిలో కూడా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని, గుజరాత్, మధ్యప్రదేశ్ లలో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉందని చెప్పిన సీఎం.. అలాంటి పరిస్థితులు ఏపీలో రాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో 243 కొవిడ్‌-19 ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, 21,226 మంది నర్సులు, వైద్యులను నియమించామని చెప్పారు. ఇప్పటికీ ప్రతి ఆసుపత్రిలోనూ రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామని, 85శాతం మంది ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా.. నిల్వ, పంపిణీ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉన్నట్టు ప్రకటించారు.

First Published:  4 Dec 2020 11:23 PM GMT
Next Story