Telugu Global
Cinema & Entertainment

అమాంతం కోటి పెంచిన హీరో

సత్యదేవ్… ఓటీటీ హీరో అనిపించుకున్నాడు ఈ నటుడు. లాక్ డౌన్ టైమ్ లో ప్రేక్షకులకు ఇతడి సినిమాలే దిక్కయ్యాయి. వరుసగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అలా క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో.. ఆ పాపులారిటీతో వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఇలా సినిమాల సంఖ్యను పెంచడంతో పాటు తన పారితోషికాన్ని కూడా పెంచాడు సత్యదేవ్. మొన్నటివరకు సినిమాకు 35 లక్షల నుంచి 50 లక్షల వరకు తీసుకునే ఈ హీరో.. […]

అమాంతం కోటి పెంచిన హీరో
X

సత్యదేవ్… ఓటీటీ హీరో అనిపించుకున్నాడు ఈ నటుడు. లాక్ డౌన్ టైమ్ లో ప్రేక్షకులకు ఇతడి సినిమాలే దిక్కయ్యాయి. వరుసగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అలా క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో.. ఆ పాపులారిటీతో వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో అరడజను సినిమాలున్నాయి.

ఇలా సినిమాల సంఖ్యను పెంచడంతో పాటు తన పారితోషికాన్ని కూడా పెంచాడు సత్యదేవ్. మొన్నటివరకు సినిమాకు 35 లక్షల నుంచి 50 లక్షల వరకు తీసుకునే ఈ హీరో.. ఇప్పుడు కోటి రూపాయలు తీసుకుంటున్నాడు. స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోల రేట్లతో పోల్చి చూసుకుంటే ఇది తక్కువే అయినప్పటికీ.. మరో సక్సెస్ పడితే సత్యదేవ్ రేంజ్ మినిమం 4 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఈ హీరో గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అతడు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటే.. ఇదే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నకు కూడా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. నిజానికి తమన్న రేంజ్ కోటి పాతిక లక్షలు. ఎందుకో ఈ సినిమాకు ఆమె రిబేటు ఇచ్చింది.

First Published:  11 Dec 2020 5:36 AM GMT
Next Story